స్లో అయ్యాననే ఫీలింగులో రామ్ చరణ్

By Bojja Kumar

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ చాలా స్లో అయిపోయాడు. ఆయన చివరి సినిమా ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం విడుదలై నాలుగు నెలలైనా తర్వాతి సినిమా ఇంకా మొదలు కానే లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తనవి రెండు సినిమాలు విడుదల అవుతాయా? లేక ఒక సినిమాతోనే సరిపెట్టాల్సి వస్తుందా? అనే ఆలోచనలో పడ్డాడట.

త్వరలో ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం షూటింగు ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈచిత్రం త్వరిత గతిని పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రస్తుతం ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

 Ram Charan

ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. శ్రీను వైట్ల సినిమా త్వరగా పూర్తయితే జులై నెలలో సురేందర్ రెడ్డి సినిమా ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎలా గైనా ఈ సంవత్సరం తనవి రెండు సినిమా రిలీజులు ఉండేలా ప్లాన్ చేసకుంటున్నాడు.

మరి రామ్ చరణ్ అనుకున్నప్రకారం పని జరుగాలంటే...దర్శకులు శ్రీను వైట్ల, సురేందర్ రెడ్డి సహకారం తప్పనిసరి. అయితే సినిమాలు మొదలైన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేం. అంతా రామ్ చరణ్ కోరుకున్న విధంగా చకచకా షూటింగులు జరుగాలని అభిమానులు ఆశిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X