»   » ‘రచ్చ’ కోసం రామ్ చరణ్ కి బెండ్ తీశారట...!

‘రచ్చ’ కోసం రామ్ చరణ్ కి బెండ్ తీశారట...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యాక్షన్ హీరో అంటే ఇప్పుడు కేవలం షర్టు మడతెడితే సరిపోదు. చొక్కా విప్పేసి కండలన్నీ ఉండలు చేసి చూపించాలి. ఇది కొందరు హీరోల అభిప్రాయం. చాలా మంది చొక్కా విప్పకుండానే ఫైట్లు చేస్తున్నా అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి కొందరు మాత్రం మాస్ హీరోకి సిక్స్ ప్యాక్ తప్పదని అంటున్నారు. రచ్చ సినిమాలో సూపర్ బాడీతో కనిపించాలని తపిస్తున్న చరణ్ ఆపకుండా ఎక్స్ ర్ సైజులు చేస్తూనే ఉన్నాడు. క్రాష్ కోర్సులో భారీగా కండలు కావాలంటే ఒళ్లొంచక తప్పదు కాబట్టి చరణ్ కి అతని ట్రెయినర్స్ బెండు తీసేశాడు.

తన ట్రెయినర్ ని విపరీతంగా ద్వేషిస్తున్నానని, ఇది అతను బాగా పని చేస్తున్నాడనేదానికి నిదర్శనమని చెప్పాడు. వాళ్ళంతా స్ట్రిక్ట్ గా లేకపోతే నా బాడీని అంతలా బిల్డప్ చేయగలిగేవాడిని కాదని కూడా అంటున్నాడు. అయితే అభిమానులు ఆక్రోశిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ రచ్చ ప్రారంభోత్సవం ఎప్పుడు జరుగుతుందో తెలీక తికమకపడుతున్నారు.

English summary
Mega Power Star Ram Charan Teja’s new film Racha launches its meeting on June 12. It is evident that Tamanna is playing Ram Charan’s in the film. Now the latest rumor is Bubbly actress Colours Swathi is playing a major role in the movie and is also scheduled to sing a song in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu