For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాకు షాట్ టెంపర్, బిగ్ బి టిప్స్ చెప్పలేదు (చెర్రీ ఇంటర్వ్యూ..)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 'జంజీర్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి 1974లో నటించిన'జంజీర్' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న 'జంజీర్' చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా, అమిత్ మిశ్రా నిర్మిస్తున్నారు.

  ఈ చిత్రంలో అమితాబ్ పోషించిన పోలీస్ ఆఫీసర్ విజయ్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. జయాబచ్చన్ పాత్రలో ప్రియాంక చెప్రా నటిస్తోంది. ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోస్తున్నారు.

  తాజాగా ఓ ఆంగ్లపత్రిక ఇచ్చిన ఇంటర్యూలో రామ్ చరణ్ ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. అందుకు సంబంధించి వివరాలను స్లైడ్ షోలో వీక్షించండి.

  విలేఖరి: జంజీర్ సినిమాను మే 10న విడుదల చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. కానీ సినిమా చుట్టూ పలు సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేస్తారనే నమ్మకం ఉందా?
  చెర్రీ: జంజీర్ చిత్రంపై రచయితలు సలీమ్-జావేద్ వివాదానికి దిగిన మాట వాస్తవమే. వారు తమ కథను మళ్లీ వాడుకుంటున్నందుకు రూ. 6 కోట్లు ఇవ్వమని అడుగుతున్నారు. గుడ్ న్యూస్ ఏమిటంటే ఇప్పటి వరకు షూటింగ్ మాత్రం ఆగలేదు. ప్రశాంతంగా షూటింగ్ జరుగుతోంది. దర్శక, నిర్మాతలు త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది. తెలుగు, హిందీ వెర్షన్ ఒకేసారి విడుదలవుతుంది.

  విలేఖరి: దర్శకుడు అపూర్వ లఖియా మిమ్మల్ని రీమేక్ చిత్రంలో చేయమని అడిగినపుడు మీరు ఎలా స్పందించారు.
  చెర్రీ: ఆయన నన్ను ఈవిషయం అగ్గానే....‘అపూర్వ, మీకేమైనా పిచ్చా? నన్ను అమితాబ్ పాత్రలో చేయమంటారేంటి?' అనుకున్నాను. కానీ స్క్రిప్టు విన్న నేను రియలైజ్ అయ్యాను. ఇది రీమేక్ చిత్రం ఏమాత్రం కాదు, ఇది కేవలం రీ-ఇమేజినైజ్డ్(దాని నుంచి ఊహించిన) చిత్రం మాత్రమే. అపూర్వ గోప్ప యాక్షన్ డైరెక్టర్. సినిమా చూసిన తర్వాత ఆయన పనితనం ఏమిటో అర్థం అవుతుంది.

  విలేఖరి: జంజీర్ చిత్రం హిట్ అయిన తర్వాత మీ మొదటి ప్రాధాన్యత బాలీవుడ్ కా, టాలీవుడ్ కా?
  చెర్రీ: నా మొదటి చాయిస్ ఎప్పటికీ తెలుగు సినిమాలకే...

  విలేఖరి: బచ్చన్ సార్ జంజీర్ షూటింగును సందర్శించి బ్లెస్సింగ్స్ ఇచ్చారు కదా. మీకేమైనా విజయ్ పాత్రపై టిప్స్ ఇచ్చారా?
  చెర్రీ: సినిమా ఫస్ట్ షెడ్యూల్ జరిగిప్పుడు అమితాబ్ బచ్చన్ సెట్స్ ను సందర్శించారు. అందరం ఎంతో హ్యాపీగా ఫీలయ్యాం. ఆయన పాత్రను నేను చేస్తున్నందుకు అమిత్ జీ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసారు. కానీ ఆయన నాకు ఎలాంటి టిప్స్ ఇవ్వలేదు.

  విలేఖరి: ప్రస్తుతం ప్రియాంక పాప్ స్టార్ గా మారి పాటలు పాడుతుంది. ఆమె మీకేమైనా సింగింగ్ లెస్సన్స్ చెబుతోందా?
  చెర్రీ: ప్రియాంక మంచి ప్రొపెషనల్ యాక్టర్, నేను సింగర్ ను కాదు కాబట్టి నాకు సింగింగ్ లెస్సన్స్ ఏమీ చెప్పలేదు.

  విలేఖరి: మీ నాన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు. భవిష్యత్ లో మీరు రాజకీయాల్లోకి వెళతారా?
  చెరీ: నాకు అలాంటి ఉద్దేశ్యం లేదు.

  విలేఖరి: రియల్ లైఫ్ లో కూడా మీరు యాంగ్రీ యంగ్ మ్యానా?
  చెర్రీ: నాకు షాట్ టెంపర్ ఎక్కువ, కానీ అది ఇతరులు భయపడేంతగా ఉండదు.

  English summary
  "My first reaction was, "Apoorva, are you mad? You want me to step into Amitabh Bachchan's shoes?" Later, I heard the script and realized it wasn't a Zanjeer remake, but Zanjeer re-imagined. Any actor after hearing the script would have given his nod. Apoorva is a great action director and currently, action fever is on." told to TOI.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X