twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ ‘జంజీర్/తుఫాన్’ లీగల్ సమస్య ఓ కొలిక్కి!

    By Bojja Kumar
    |

    ముంబై: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రం విడుదలకు అడ్డంకి మారిన లీగల్ సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ సినిమా విడుదల కాకుండా విధించిన స్టే ఆర్డర్‌ను బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఎత్తి వేసింది. సినిమా విడుదల చేసుకోవచ్చంటూ నిర్మాత అమిత్ మిశ్రాకు ఊరటనిచ్చింది

    1973లో వచ్చిన 'జంజీర్' చిత్రం ఒరిజినల్ వెర్షన్‌ను అమిత్ మెహ్రా తండ్రి ప్రకాష్ మెహ్రా 'ప్రకాష్ మెహ్రా ప్రొడక్షన్స్' బేనర్ పై నిర్మించారు. అతని పెద్ద కుమారుడైన అమిత్ మెహ్రాకు సంబంధించిన అడయ్ మెహ్రా ప్రొడక్షన్స్ ప్రై.లి జంజీర్ చిత్రం రీమేక్ హక్కులను కొనుగోలు చేసింది.

    అయితే అమిత్ మెహ్రా తన ఇద్దరు సోదరులకు.... రీమేక్ రైట్స్‌కు సంబంధించిన డబ్బులను చెల్లించడంలో విఫలం అయ్యాడు. దీంతో వారు కోర్టును ఆశ్రయించి సినిమా విడుదల కాకుండా స్టే తెచ్చుకున్నారు. మరో వైపు ఒరిజినల్ జంజీర్ చిత్ర రచయితలైన జావేద్ అక్తర్, సలీమ్ ఖాన్‌ను కూడా తమకు రూ. 6 కోట్ల రాయల్టీ చెల్లించాలని వారు కూడా అదే కోర్టు ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

    ఈ నేపథ్యంలో వీరికి చెల్లించాల్సిన మొత్తాన్ని 8 వారాల్లో చెల్లిస్తానని అమిత్ మెహ్రా కోర్టుకు విన్నవించడంతో సినిమా విడుదలకు అనుమతి ఇస్తూ కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో జంజీర్, ఆ చిత్రం తెలుగు వెర్షన్ తుఫాన్ విడుదలకు అడ్డంకులు తొలగినట్లయ్యాయి.

    అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సెక్సీలేడీ ప్రియాంక చోప్రా హీరోయిన్. హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు. సమ్మర్లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    The dispute between producer Amit Mehra and his two brothers Sumeet and Punit over the remake rights of films Zanjeer and Thoofan was finally solved and the Bombay High Court has lifted the stay order on the release of the two films issued by the single judge bench of the same court.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X