»   » 'ప్రేమమ్‌' తెలుగు రీమేక్: హీరో రామ్ స్పందన ఇదిగో

'ప్రేమమ్‌' తెలుగు రీమేక్: హీరో రామ్ స్పందన ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా మళయాళంలో ఘనవిజయం సాధించిన చిత్రం 'ప్రేమమ్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో రామ్‌ హీరోగా రీమేక్‌ చేయనున్నట్టు మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. మరో ప్రక్క ఇప్పటికే 'ప్రేమమ్‌' చిత్రానికి సంబంధించి రీమేక్‌ రైట్స్‌ను నిర్మాత స్రవంతి రవికిషోర్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ విషయమై రామ్ కాస్త ఘాటుగా స్పందించాడు. ఆయనేం అన్నాడో ఆయన ట్వీట్ చూడండి.

"క్లారిటీ కోసం : కొనడం సంగతి ప్రక్కన పెడితే...ఇప్పటివరకూ ఆ ప్రేమమ్ సినిమా గురించి వినడమే తప్ప చూడటము కూడా జరగలేదు ... " అని రామ్ అన్నారు. 'పండగచేస్కో' చిత్రం తర్వాత రామ్‌ 'శివమ్‌', 'హరికథ' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇప్పుడు సిని ప్రియుల నోళ్లలో నానుతున్న చిత్రం 'ప్రేమమ్' . ఈ మళయాళ చిత్రం ఊహించని విధంగా ఘన విజయం సాధించింది. నివిన్ పౌలీ ఈ చిత్రంతో హీరో గా పరిచయమయ్యారు. ఆల్ఫోన్సే పూతరేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కింది. మే 29న విడుదలయిన ఈ చిత్రం పెద్ద హిట్టయ్యింది.

ఇప్పటికీ హౌస్ ఫుల్ షోస్ తో జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్న ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లీకేజి కు కారణంగా వీరినే టార్గెట్ చేయటానికి కారణమాలు మళయాళ మీడియాలో ఇప్పుడు ఊపందుకున్నాయి. ప్రేమమ్ సెన్సార్ కాపీ...లీక్ అయ్యింది. ఈ సెన్సార్ కాపీ.. ..విశ్వమాయ మాక్స్, ఫోర్ ఫ్రేమ్ నుంచి బయిటకు వచ్చింది.

Ram Denies Premam Rumours

ప్రేమమ్ సినిమా విషయానికొస్తే...

మే 29 న విడుదలయిన ప్రేమమ్ ఒక్క కేరళ లోనే 20 కోట్లు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో కేరళ స్టర్స్ మమ్ముట్టి , మోహన్ లాల్ లాంటి వారు ఎవరూ లేక పోయినా బాక్సాఫీసు వద్ద కాసులు కురిపిస్తోంది.

జార్జ్ అనే కుర్రాడు టీనేజ్ లో, కాలేజ్ లో, సెటిలేజ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వారి ప్రేమను సాధించుకోవటం లో ఊహించని అడ్డంకులు ఎదురై ,కలలు కరిగిపోయి ప్రేమించిన వారు మరొకరితో సెటిల్ అవ్వతుంటారు. ఈ పరిణామాలను దర్శకుడు అల్ఫోన్సో పుత్తరేన్ మనసుకు హత్తుకునే చూపించారు.

జూన్ నెలలో విడుదలైన ఈ 'ప్రేమమ్' చిత్రం టాక్ బాగుండటంతో ... విదేశాలలోనూ విడుదల చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా వసూళ్ళు యాభై కోట్లకు చేరుకున్నాయి. మళయాళ పరిశ్రమలో ఇలా లో బడ్జెట్ చిత్రం ఈ రేంజిలో హిట్ అయ్యి..ఇంత వసూలు చేయటం పెద్ద రికార్డు. ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ భాషల నుండే కాకుండా హిందీ పరిశ్రమనుండీ మంచి డిమాండ్ ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

English summary
Ram tweeted “Clarity kosam: Konadam sangathi pakkana pedithe…ippativaraku a cinema gurinchi vinadam thappa chudadam kuda jaragaledhu… #Premam” [sic] wrote Ram Pothineni on his micro blogging site.
Please Wait while comments are loading...