Just In
- 3 hrs ago
ఓ వైపు సాయి పల్లవి, మరోవైపు శేఖర్ కమ్ముల.. ఏదైనా నాగచైతన్యకు లాభమే!
- 3 hrs ago
తెలుగులో భారీగా ఆఫర్లు అందుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్.. అఖిల్, బన్నీతో కూడా..
- 4 hrs ago
నగ్నంగా సీనియర్ నటి ఫోటోషూట్.. సంచలనం రేపుతున్న కిమ్
- 5 hrs ago
మహానటి దర్శకుడి కోసం మరో కొత్త ప్లాన్ రెడీ చేసుకున్న ప్రభాస్!
Don't Miss!
- News
బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ జడ్జీలు -ఎన్నికల కేరళలో సంచలనం -బ్రాహ్మణ రిజర్వేషన్, లవ్ జీహాద్ కారణాలు
- Finance
ఆ ధరతో రూ.10,500 తక్కువ, రూ.46,000 దిగువకు పడిపోయిన బంగారం
- Sports
హార్దిక్ పాండ్యాతో పోటీకి శార్దూల్ ఠాకూర్ సై.. 6 సిక్స్‌లతో వీరవిహారం.. సెంచరీ జస్ట్ మిస్!
- Automobiles
ఫిబ్రవరిలో టీవీఎస్ అమ్మకాల హవా.. మళ్ళీ పెరిగిన అమ్మకాలు
- Lifestyle
బియ్యం పిండిని ఇలా ఉపయోగించడం వల్ల కలిగే అద్భుతాల గురించి మీకు తెలుసా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇన్నేళ్లకు ఆ విషయం తెలిసింది.. ఇకపై నేనేంటో చూపిస్తా.. రామ్ కామెంట్స్ వైరల్
రామ్ హీరోగా వచ్చిన RED సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఎలా సందడి చేస్తోందో అందరికీ తెలిసిందే. టాక్ ఎలా ఉన్నా కూడా సంక్రాంతి విజేతగా నిలిచేందుకు దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో ఉంది. ఇలా కలెక్షన్లలో దూసుకుపోతున్నందుకు, ఇంతటి విజయాన్ని సాధించడంతో RED సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించారు. వైజాగ్‌లో RED సక్సెస్ ఈవెంట్ కార్యక్రమం జరిగింది.
ప్రభాస్ - రాకీ భాయ్: Salaar Movie Pooja & Launch Photos

విడుదల తరువాత ఒక పెద్ద ట్విస్ట్..
RED సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో రామ్ మాట్లాడుతూ... మేం చాలా ట్విస్టులతో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీసాం. కానీ సినిమా లో ఉన్న ట్విస్టులకన్నా సినిమా విడుదల తరువాత ఒక పెద్ద ట్విస్ట్‌ని ఎక్స్ పీరియన్స్ చేశాం. నిజానికి సినిమా రిలీజ్ టైమ్‌లో ఈ సినిమాను ఆడియన్స్ ఎలా రిజీవ్ చేసుకుంటారు? వారి నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అని ఈగర్‌గా వెయిట్ చేశామని రామ్ అన్నాడు.

కలెక్షన్లు అంతకంతకూ..
RED మార్నింగ్ షో కి వచ్చిన అభిప్రాయాలన్నీ సాయంత్రానికి మారిపోయాయి. ప్రతి షో పూర్తయిన తర్వాత మరుసటి షోకి కలెక్షన్లు అంతకంతకూ పెరగసాగాయి. మా సస్పెన్స్ థ్రిల్లర్ ని థ్రిల్లింగ్ హిట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలని రామ్ ఎమోషనల్ అయ్యాడు.

మణిశర్మ మ్యూజిక్..
REDకి మేము అందరం చాలా కష్టపడ్డాం. ప్రతి సన్నివేశాన్నీ ఇష్టపడి చేసాం. మా ప్రయత్నాన్ని అందరూ ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని అద్భుతంగా రాసిన కిషోర్ తిరుమలకి ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్‌తో మూల స్తంభంలా నిలుచున్నారు. ఆయనతో ఇస్మార్ట్ శంకర్ తరువాత ఇది మరో హిట్ కంబినేషన్. మా కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందని రామ్ చెప్పుకొచ్చాడు.

కాంపిటీషన్ ఎవరు..
మాళవికను అందరూ టాలీవుడ్ కి కొత్త క్రష్ అని పిలుస్తున్నారు . తను చాలా అద్భుతంగా చేసిందీ చిత్రంలో. 15 సంవత్సరాల ముందు ఇదే సంక్రాంతికి దేవదాస్ సినిమాతో వచ్చా . పరిశ్రమలో ఇప్పటికీ చాలా మంది మీకు కాంపిటీషన్ ఎవరు అని అడుగుతుంటారని రామ్ పేర్కొన్నాడు

నేను ఏంటో చూపిస్తా..
15 సంవత్సరాల తరువాత నా కాంపిటీషన్ ఎవరనే విషయం అర్థం అయింది. అభిమానులుగా మీరు చూపించే ప్రేమ ఎక్కువా, నేను మీకు చూపించే ప్రేమ ఎక్కువా అన్నదాంట్లోనే మనకి పోటీ నడుస్తోందని రామ్ చెప్పుకొచ్చాడు. ఇకపై నేను ఏంటో చూపిస్తా.. మీరు చూపించే ప్రేమ ఎక్కువా?. లేదా తెరపై నేను చూపించే ప్రేమ ఎక్కువా? అని చూపిస్తాను అని రామ్ ఎమోషనల్ అయ్యాడు.