twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొలిసారి భయంతో తీసిన సినిమా మాత్రం ఇదే

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''కొన్ని సినిమాలను నేను నిశ్చితాభిప్రాయంతో తీశాను, మరికొన్ని కసితో తీశాను, చాలాసార్లు పొగరుతో తీశాను. కానీ నా సినీ జీవితంలో తొలిసారి భయంతో తీసిన సినిమా మాత్రం ఇదే'' అంటున్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '26/11 ఇండియాపై దాడి'. నానాపటేకర్‌ ముఖ్య భూమిక పోషించారు. కాంతారావు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రదర్శించారు.

    2008లో ముంబయ్‌లో జరిగిన తీవ్రవాద దాడుల నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఇండస్ ఇన్‌స్పిరేషన్స్ పతాకంపై ఎన్.ఎ.కాంతారావు నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియావారు అడిగిన పలు ప్రశ్నలకు రాము ఈ విధంగా సమాధానం చెప్పారు.

    ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ....నేను భయపడటమంటే ఈ సినిమా బాగా వస్తుందా లేదా? ప్రేక్షకులకు నచ్చుతుందా అని కాదు. 26/11 దాడుల సమయంలో ప్రత్యక్షంగా అక్కడ ఉన్న పోలీసు అధికారులు, ఇతర బాధితులు నాతో పంచుకొన్న విషయాల్ని నేను సరిగ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతానా లేదా? అనే భయంతో ఈ సినిమా చేశాను అన్నారు.

    అలాగే ఈ దాడులను ప్రత్యక్షంగా చూసిన బాధితుల తాలూకు ఉద్వేగం చాలా విలువైనది. దాన్ని చెడగొట్టకుండా తెరపైకి తీసుకురావాలనుకొన్నాను. పది మంది పడవలో నుంచి దిగి రెండు కోట్ల జనాభా ఉన్న ముంబై నగరాన్ని గడగడలాడించడం మామూలు విషయం కాదు. నాలుగేళ్లయినా ఆ దాడుల్ని మనం మరిచిపోలేకపోతున్నాం. అక్కడ ఏం జరిగిందనే విషయం అందరికీ తెలుసు. కానీ ఎలా జరిగిందన్నదే తెలియదు. ఆ రోజు రాత్రి 9:30 గంటల నుంచి ఒంటిగంట వరకు ఏం జరిగిందనే విషయాల్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నమే ఈ సినిమా. తాజ్‌ హోటల్‌లో ఉన్న ఓ మనిషి మనమే అయితే ఆ భావోద్వేగాలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపిస్తున్నాం. కసబ్‌ కాల్పులు జరుపుతున్నప్పుడు అతని భావోద్వేగాలు ఏమిటో ఎవ్వరికీ తెలియదు, ఏ పరిశోధనలోనూ ఆ విషయం తేలదు. కానీ నా వూహాకల్పనతో ఆ భావోద్వేగాల్ని చూపించాను అన్నారు.

    English summary
    The Attacks of 26/11, co-produced by Alumbra Entertainment and Eros International, features Nana Patekar and Sanjeev Jaiswal in key roles. The film is slated for March 1 release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X