»   »  జియా ఖాన్ ఆత్మహత్యపై రామ్ గోపాల్ వర్మ

జియా ఖాన్ ఆత్మహత్యపై రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ గా పరిచయం చేసిన జియా ఖాన్....ఎవరూ ఊహించని విధంగా సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జియా ఖాన్ బలవన్మరణంతో బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా షాకయింది. ఈ విషయమై ఆయన ట్విట్టర్ లో బాధగా స్పందించారు..

"నేను నిశ్శబ్ద్ లో ఆమె చేత నటింప చేసేటప్పుడు గమనించా..ఆమె చాలా షార్ప్, ఎంతో ఉత్సాహవంతమైన స్పిరిట్ తో ఉండేది. మొదటి సినిమాకే అలా ఉండేవాళ్లను నేను చూడలేదు. ఆమె సమస్య ఏదైనా నిశ్శబ్ద్ లో ఆమె క్యారెక్టర్ ఫిలాసపి అయిన టేక్ లైట్ అనేది తీసుకుంటే బావుండేది. ఆమెను చివరి సారి కలిసినప్పుడు ఆమె తాను పూర్తి ఫెయిల్యూర్ ఉన్నట్లు చెప్పింది. ఎంతో పేరు తెచ్చుకున్న నిశ్శబ్ద్, ఎంతో సక్సెస్ అయిన గజనీ, హౌస్ ఫుల్ తర్వాత ఆమె పనిలేక మూడు సంవత్సరాల పాటు ఖాళీగా ఉంది. ఆమె అంత డిప్రెస్ అవటానికి,భవిష్యత్ అంటే భయం పుట్టడానికి ఏదీ కారణమో తెలియటం లేదు" అంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు.

నిశ్శబ్ద్‌, హౌస్‌ఫుల్‌ చిత్రాలతో పాటు అమీర్‌ఖాన్‌ సరసన గజని చిత్రంలోనూ నటించారు. 2010లో వచ్చిన హౌస్‌ఫుల్ సినిమా తర్వాత ఆమె ఏ చిత్రంలోనూ నటించలేదు. ఫిబ్రవరి 20, 1988లో లండన్లో పుట్టిన జియా ఖాన్ 18 ఏళ్ల వయసులోనే నిశ్శబ్ధ్ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె తల్లి రబియా 80ల్లో బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తల్లి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని ఎన్నో ఆశలతో బాలీవుడ్లో అడుగు పెట్టిన జియా ఖాన్‌ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదనే చెప్పాలి. దీనికి తోడు పర్సనల్ ప్రాబ్లన్స్, అవకాశాలు దొరకక పోవడం లాంటి సమస్యలు ఆమెను ఆత్మహత్య వైపు పురిగొల్పినట్లు బాలీవుడ్ టాక్. 25 ఏళ్ల వయసులోనే జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడటం పలువురిని కలిచి వేసింది.

English summary
RGV Tweeted: "Never ever seen a debutant actress with more spunk and more spirit than Jiah when i was directing her in Nishabd. No matter what her problem was I just so wish she applied her on screen philosophy of Nishabd to her own life which is to .'take lite'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu