»   » మమ్ముటి అవార్డ్స్ వెనక్కి తీసుకోవాలంటున్న రామ్ గోపాల వర్మ

మమ్ముటి అవార్డ్స్ వెనక్కి తీసుకోవాలంటున్న రామ్ గోపాల వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓకే బంగారం' సినిమా చూసిన అనంతరం వర్మ స్సందిస్తూ మమ్ముటి అవార్డులు కమిటీ వెనక్కి తీసుకోవాలని, ఆ అవార్డులు అన్ని వెనక్కి తీసుకుని ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ కు ఇవ్వాలని కామెంట్ చేసారు. ఓకే బంగారం సినిమాలో దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా నటించారు.

‘మణిరత్నం సినిమా చేసాను. అవార్డుల కమిటీ మెంబర్స్‌కు సెన్స్ ఏ మాత్రం ఉన్నా ఇప్పటి వరకు మమ్ముట్టికి వచ్చిన అవార్డులు వెనక్కి తీసుకోవాలి. ఆ అవార్డులన్నింటినీ ఆయన కుమారుడికి' ఇవ్వాలి అంటూ వర్మ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో కామెంట్ చేసారు. వర్మ వ్యాఖ్యలు చూస్తుంటే ఈ సినిమా అతనికి నచ్చినట్లే ఉంది.


Ram Gopal Varma about Mani's Ok Bangaram

‘ఓకే బంగారం' సినిమా గురించి వివరాల్లోకి వెళితే...ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీసు వద్ద మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తోంది. గత కొన్నేల్లుగా మణిరత్నం నుండి ఒక్క హిట్టూ లేదు. ఆయన గత సినిమాలు రావన్, కడలి చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి. ‘ఓకే బంగారం' చిత్రంతో మణిరత్నం మళ్లీ ఫాంలోకి రావడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమకథా చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే మణిరత్నం మరోసారి ఈ చిత్రంలో తన మార్కు చూపించాడు.


మణిరత్నం చిత్రం అంటేనే ఆటోమేటిక్‌గా ఒక క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఆయన దర్శకత్వ శైలినే అందుకు కారణాలు కావచ్చు. మౌనరాగం, దళపతి, నాయకన్, అగ్నినక్షత్రం లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల సృష్టికర్త మణిరత్నం. ఈయన భారీ యాక్షన్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో ఎంత దిట్టనో, అందమైన ప్రేమ కథా చిత్రాలను సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించడంలోనూ అంత సిద్ధహస్తుడు.

English summary
"Just saw Mani's film and if the award committee members have any sense they will take back all awards of Mamooty and give it to his son..!!" Ram Gopal Varma said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu