»   » నాగార్జున ‘ఆఫీసర్’ మూవీపై కాపీ రూమర్స్, క్లారిటీ ఇచ్చిన వర్మ!

నాగార్జున ‘ఆఫీసర్’ మూవీపై కాపీ రూమర్స్, క్లారిటీ ఇచ్చిన వర్మ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఆఫీసర్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది.

అయితే ఈ చిత్రం ఫ్రెంచి యాక్టర్ లియా నీసన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'టేకెన్' నుండి ఇన్స్‌స్పైర్ అయి తీస్తున్న చిత్రం అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై రామగోపాల్ వర్మ స్పందించారు. 'టేకెన్' చిత్రానికి, 'ఆఫీసర్' చిత్రానికి ఎలాంటి పోలిక ఉండదని తెలిపారు.

Ram Gopal Varma about on Officer rumours

ఈ సినిమా ఏ సినిమాకు ఇన్స్‌స్పిరేషన్ కాదని, ఇతర ఏ సినిమా కథతో దీనికి సంబంధం ఉండదు అని తెలిపారు. ఒక పోలీస్ అధికారి, అతడి కూతురు చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా సాగుతుందని, ఇప్పటి వరకు రాని ఒక సరికొత్త కథ అని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

ఈ చిత్రంలో మైరా సరీన్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఆర్ కంపెనీ బేనర్లో సుధీర్ చంద్ర, రామ్ గోపాల్ వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 25వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దాదాపు 25 సంవత్సరాల తర్వాత రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్లో సినిమా వస్తోంది. వర్మ సినిమా అంటేనే విభిన్నంగా ఉంటుంది. మరి 58 ఏళ్ల నాగార్జునను పోలీస్ ఆఫీసర్‌గా వర్మ తెరపై ఎలా చూపించబోతున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.

English summary
It is known news that Akkineni Nagarjuna collaborated with filmmaker Ram Gopal Varma after 25 years for the upcoming action entertainer Officer. However, it is now being said that RGV’s film is inspired by actor Liam Neeson’s French action thriller series, Taken. But finally Varma came forward and completely denied the news.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X