Don't Miss!
- News
Lady: భర్త మీద కోపం, పుట్టింటిలో కూతుర్ని, అమ్మమ్మను కొట్టి చంపేసింది !
- Sports
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
ఆయన వద్ద అసిస్టెంట్ డైరక్టర్‌గా చేరుతా: వర్మ

వర్మ ట్వీట్ ఏమిటంటే... ''వార్' చూశాను. ఆ సినిమా దర్శకుడు బిలాల్ లస్‌హరికి నా అభినందనలు. ఈ సినిమాని నేను ఓ విద్యార్థిలా చూశాను. దర్శకుడి పనితనం ఎంతగా నచ్చిందంటే వెంటనే పాకిస్థాన్ వెళ్లిపోయి అతని దగ్గర సహాయ దర్శకుడిగా చేరాలనుంది. మన దర్శకులు పాకిస్థాన్ చిత్రాలు చూసి సినిమాల్ని తెరకెక్కించడంలో వైవిధ్యాన్ని చూపించాలనుకొంటున్నాను''అని ట్వీట్ చేశారు.
ఇక భారతదేశాన్ని టెర్రరిజం పెంచి పోషిస్తున్న దేశంగా చూపించిన సంచలన పాకిస్తానీ చిత్రం 'వార్' చిత్రాన్ని పైరేటెడ్ కాపీ ద్వారా తిలకించారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. పైరసీ ద్వారా ఆ సినిమా చూసినందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ఆ సినిమా చూశాక దర్శకత్వాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్ వెళ్లి దాని దర్శకుడు బిలాల్ లషరి వద్ద అసిస్టెంట్‌గా పనిచేయాలని అనిపించిందనే ఆసక్తికర వ్యాఖ్యలు సైతం చేశారు.
"అక్కడ (పాకిస్తాన్‌లో) షారుఖ్‌ఖాన్ పెద్ద స్టార్. ఆయన సినిమా 'చెన్నై ఎక్స్‌ప్రెస్' అక్కడ మొదటిరోజు 9 మిలియన్లను వసూలు చేయగా బిలాల్ లషరి 'వార్' 11.4 మిలియన్లను వసూలు చేసింది. 'వార్'ని చూశాక భారతీయ సినిమా రూపకర్తలు ఊహల్లో విహరించడం మాని, పాకిస్తానీ సినిమాల వేపు సీరియస్‌గా దృష్టి సారించాలని సీరియస్‌గా ఫీలవుతున్నా. మిస్టర్ బిలాల్ లషరి.. పాకిస్తాన్‌లో నువ్వెక్కడున్నా నీకు సెల్యూట్ చేయాలనుకుంటున్నా.
నేను సినీ విద్యార్థిని. నీ సినిమా చూసి థ్రిల్లయ్యాను. హేయ్.. పాకిస్తాన్‌లో బిలాల్ లషరిని వ్యక్తిగతంగా తెలుసున్న వ్యక్తులెవరైనా ఉంటే దయచేసి నా శుభాభినందనలను ఆయనకు తెలియజేయండి. 'వార్'లో భారత వ్యతిరేక సెంటిమెంట్‌ను చిత్రించడం అనేది బిలాల్ వ్యక్తిగత ప్రజాస్వామిక భావనలో ఓ భాగం. కానీ అందులోని పాత్రల్ని బిలాల్ చిత్రించిన విధానానికి నేను ముగ్ధుడనయ్యాను. 'వార్'ను నేనెలా చూశానని అడుగుతున్న వారికి నేను చెప్పేదేమంటే ఆ సినిమా గురించి ఇక్కడ చాలా మంది చెప్పుకుంటుంటే ఆగలేకపోయా. క్షమించండి. నేను చూసింది ఆ సినిమా పైరేటెడ్ కాపీని. దాని దర్శకుడు బిలాల్ ఆ సినిమా కాపీలను ఇక్కడకు పంపితే మేలు చేసిన వాడవుతాడు. 'వార్'ని మన భారతీయ సినిమా రూపకర్తలందరూ చూడాలి'' అని చెప్పారు.