»   » నీకేమైనా పిచ్చా...అని హీరోని అన్నా: రామ్ గోపాల్ వర్మ

నీకేమైనా పిచ్చా...అని హీరోని అన్నా: రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

'నీకేమైనా పిచ్చా...రేపటి నుంచి షూటింగ్‌..ఇప్పుడు ఇదంతా అవసరమా?..అయినా ఇంత కన్నా గొప్పగా బాడీని ఎలా డెవలప్‌చేస్తావ్‌..' అని తమిళ హీరో సూర్యని అన్నాను. దానికతను...'నన్ను నమ్మండి' అని వెళ్లి పోయాడు. ఓయాక్షన్ సీక్వెన్స్ తీసే సమయంలో సూర్య నా దగ్గరకొచ్చి...నాకు ఒక నెల సమయం కావాలని అడిగాడు. అప్పుడలా అన్నాను అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. వివేక్‌ ఓబరాయ్‌, సూర్య హీరోలుగా ఆయన రూపొం దిస్తున్న 'రక్త చరిత్ర' షూటింగ్‌లో...పాత్ర కోసం సూర్య తీసుకుంటున్న శ్రద్ధ గురించి చెబుతూ రామ్‌ గోపాల్ ‌వర్మ పై విధంగా స్పందించారు. అలాగే యాక్షన్‌ సన్నివేశాల్లో షర్ట్‌ లేకుండా డేర్‌గా నటించాలంటే ఎవ్వరికీ ధైర్యం చాలడం లేదు. ఇలాంటి టైమ్‌లో అన్ని అర్హతలూ...అన్ని సులక్షణాలు కలిగిన నటుడ్ని సూర్యలో చూశా అన్నారు.

అయితే సరిగ్గా నెల తర్వాత వచ్చిన సూర్యను చూసి షాక్‌ అయ్యాను. మైండ్‌ బ్లోయింగ్ ‌బాడీతో తిరిగొచ్చాడు. ఆ సీన్ తీసే సమయంలో అతని హావభావాలు చూస్తే వండర్‌ అనిపించింది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల్లో సూర్య బాడీ, ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ నిజంగా అద్భుతం. తాను డైరెక్టర్స్‌ హీరో అని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించను' అని రామ్ గోపాల్ వర్మ మెచ్చుకున్నారు. అందమైన దేహ దారుఢ్యం, సరైన హావభావాలు, చక్కని శారీరక భాష కలిగిన హీరోతో సినిమా చేయాలని ప్రతి దర్శకుడికీ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఆర్టిస్టుల విషయానికొస్తే...వారిలో ఏదో ఒక లోపం కని పిస్తుంది అన్నారాయన.

ఇక ఈ చిత్రాన్ని తమిళంలోనూ ఆగస్టు నెలలో విడుదల చేయనున్నారు. రక్తచరిత్ర కథ గురించి వర్మ చెబుతూ..పూర్తిగా అనంతపూర్ ‌లో జరిగిన యథార్థ కథ. ఇద్దరు ఫ్యాక్షనిస్టుల కథను తెరకెక్కించాను. పరిటాల రవి, సూరి కథను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ఇది. పగలు, ప్రతీ కారాల వెనుక కచ్చితంగా రాజకీయ శక్తులు ఉంటాయి. వాటి గురించి చర్చించే కథ ఈ సినిమా. ఇందులో పరిటాల రవిగా వివేక్‌ ఓబరాయ్‌, సూరిగా సూర్య చేశారు. ఈ సినిమా కోసం పరిటాల రవి సన్నిహితులను, సూరిని కలుసుకుని వివరాలు సేకరించాను అన్నారు. సూరి భార్య భానుమతి కేరక్టర్‌ ప్రియమణి అయితే, రవి భార్య సునిత పాత్ర అనితా ఆప్టే పోషించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu