»   »  రౌడీ : చిరంజీవికి, పవన్‌కి సంబంధంపై వర్మ వివరణ!

రౌడీ : చిరంజీవికి, పవన్‌కి సంబంధంపై వర్మ వివరణ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు ఫ్యామిలీ హీరోలు మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న సినిమా 'రౌడీ'. ఈ చిత్రం ఏప్రిల్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా రామ్ గోపాల్ వర్మ ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి అడిగిన ఓ ప్రశకు వర్మ సమాధానం ఇస్తూ....ఈ సినిమా కథ కేవలం కల్పితం మాత్రమే అని స్పష్టం చేసారు. చిరంజీవికి సంబంధించిన అంశాలుగానీ, పవన్ కళ్యాణ్ జన సేన పార్టీకి సంబంధించిన అంశాలు గానీ సినిమాలో లేవని స్పష్టం చేసాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం కూడా లేదని తెలిపారు.

Ram Gopal Varma about 'Rowdy'

తాను 'రౌడీ' లాంటి సినిమా గతంలో ఎప్పుడూ తీయలేదని రామ్ గోపాల్ వర్మ చెప్పకొచ్చారు. మంచు ఫ్యామిలీ సినిమా చేస్తుండటం వల్లనే...నా సినిమాలో తొలిసారిగా ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంటు అంశాలు జోడించానని తెలిపారు. జయసుధ ఇందులో స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్లో కనిపించబోతోందని తెలిపారు. మోహన్ బాబు, విష్ణు క్యారెక్టర్లు పరవ్‌ఫుల్‌గా ఉంటాయన్నారు.

ఈ చిత్రంలో మోహన్ బాబు ఒక మంచి రౌడీగా కనిపించబోతున్నారని, ఆయన కొడుకుగా విష్ణు నటించారని తెలిపారు. 'రౌడీ' సినిమా 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని పోలి ఉంటుందాణ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.......అలా పోలి ఉండదని, అయితే ఇన్ప్పిరేషన్‌గా ఉంటుందని, కొన్ని సిమిలారిటీస్ ఉంటాయని తెలిపారు.

మంచు విష్ణుకు జోడీగా శాన్వి నటిస్తోంది. మోహన్ బాబు విగ్గు లేకుండా ఒరిజినల్ లుక్‌తో కనిపించబోతున్నారు. విష్ణు పవర్ ఫ్యాక్డ్ యాక్షన్‌తో దుమ్ము రేపనున్నాడు. ఏవి పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఏప్రిల్ 4వ తేదీని ఈ చిత్రం గ్రాండ్‌‌గా విడుదలవుతోంది.

English summary
To hear Ram Gopal Varma say, "I never did a film like Rowdy," is a little confounding.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu