లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో దూసుకెళ్తున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు తెర లేపారు. ఓ పక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదంలో కొనసాగుతుండగానే తమిళ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన జయలలిత, శశికళ అంశాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. శశికళ బయోపిక్‌ను తీస్తున్నట్టు వర్మ అనౌన్స్ చేయడం దక్షిణాదిలో చర్చనీయాంశమైంది.
మగజాతిపై వివక్ష, జైళ్లు, మన్నార్‌గుడి గ్యాంగ్ నేపథ్యంగా శశికళ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ఈ మేరకు ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.
శశికళ బయోపిక్‌ను ఏ అంశాల ఆధారంగా, ఏ కోణంలో రూపొందిస్తారు అనే విషయంపై రాజకీయ, సినీ విమర్శకుల్లో చర్చ మొదలైంది. ఈ చిత్రాన్ని కూడా వివాదానికి కేంద్ర బిందువుగా మలిచే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తున్నది.
ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే రూ.5 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. గత దశాబ్దకాలంలో రాంగోపాల వర్మ రూపొందించిన చిత్రానికి ఈ రేంజ్‌లో కలెక్షన్లు రావడం ఇదే మొదటిసారి.
After Sasikala biopic, Ram Gopal varma going to picturise on Sasikala, Jayalalitha life events.He announced Sasikala biopic recently. He state in title first look that.. The story of A Relationship set against merciless men, Prisons and Mannargudi Gangs.
Story first published: Monday, April 1, 2019, 9:44 [IST]