Don't Miss!
- News
మావోయిస్టుల ఘాతుకం: ఫ్యామిలీ ముందే గొడ్డళ్ళతో నరికి బీజేపీ నేత దారుణ హత్య
- Finance
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు.. సంక్షేమంలో ముందుకే..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Sports
SA20 : దంచికొట్టిన సన్రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఎన్టీఆర్ అనుభవించిన నరకం.. మళ్ళీ మొదలు పెట్టిన ఆర్జీవీ.. మే 1న అంటూ ప్రకటన!
Recommended Video
అంతా ఆసక్తిగా ఎదురుచూసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రాలో విడుదల కాలేదు. తెలంగాణ, యూఎస్ లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఆంధ్ర హైకోర్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై స్టే విధించిన సంగతి తెలిసిందే. కోర్టు సమస్యలు తీరాక ఈ చిత్రం ఆంధ్రాలో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ఆంధ్ర విడుదల గురించి వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ అనుభవించిన నరకం
రాంగోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఆంధ్రలో విడుదులపై స్పందించారు. ఎట్టకేలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఆంధ్రాలో విడుదలవుతోంది. మే 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలు ఏంటో ఈ చిత్రంలో చూడండి అని ఆర్జీవీ తెలిపాడు. విడుదల తేదీని ప్రకటిస్తూ ఎన్టీఆర్ అనుభవించిన నరకం అనే పేరుతో పోస్టర్ కూడా విడుదల చేశాడు.

స్టే ఇచ్చిన న్యాయస్థానం
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకంటే ముందే విడుదల చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని టిడిపి కూడా ప్రయత్నాలు చేసింది. సరిగ్గా విడుదలకు ముందు ఆంధప్రదేశ్ హై కోర్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి షాక్ ఇస్తూ విడుదలపై స్టే ఇచ్చింది. దీనితో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ లో విడుదల కాలేదు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రభావం
ఎన్నికలకు ముందు విడుదలైతే ఈ చిత్ర ప్రభావం తప్పనిసరిగా టిడిపిపై ఉంటుందంటూ అప్పట్లో వర్మ వ్యాఖ్యలు చేశారు. కానీ తెలంగాణాలో విడుదలైన దాదాపు నెల తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఆంధ్రాలో విడుదలవుతోంది. టాక్ కూడా బయటకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రభావం బాక్సాఫీస్ వద్ద ఏమేరకు ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
|
మరో బయోపిక్
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర వివాదం కొనసాగుతుండగానే ఆర్జీవీ ఇటీవల మరో సంచలన బయోపిక్ చిత్రాన్ని ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జీవిత చరిత్రపై 'టైగర్ కేసీఆర్' అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ని కూడా ఆర్జీవీ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆంధ్రోడా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలతో ఉన్న ఓ పాటని కూడా ఆర్జీవీ పాడి వినిపించారు.