»   » త్వరలోనే 'జీఎస్‌టీ-2': వర్మ సంచలనం, 'దేవి గారు వింటున్నారా' అని కామెంట్..

త్వరలోనే 'జీఎస్‌టీ-2': వర్మ సంచలనం, 'దేవి గారు వింటున్నారా' అని కామెంట్..

Subscribe to Filmibeat Telugu
త్వరలోనే 'జీఎస్‌టీ-2' వర్మ సంచలనం..!

క్రైమ్, మాఫియా కిక్ నుంచి బయటపడ్డ ఆర్జీవి.. ఇప్పుడు 'సెక్స్' కంటెంట్‌లో ఆ కిక్‌ను వెతుక్కుంటున్నారు. 'జీఎస్‌టీ'తో బహుశా డబుల్ కిక్ వచ్చిందేమో.. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో 'జీఎస్‌టీ 2'కి కూడా సిద్దమైపోయారు. తన ట్విట్టర్ ఖాతా నుంచి వర్మ తాజాగా ఈ ప్రకటన చేశారు.

'గాడ్ సెక్స్&ట్రూత్' ఫోటోస్ లీక్: పచ్చిగా తీస్తున్నారట?.. ఎంతలా అంటే?

'జీఎస్‌టీ 2' వెరీ సూన్:

" 'గాడ్ సెక్స్&ట్రూత్'కు అద్భుతమైన స్పందన రావడంతో.. త్వరలోనే జీఎస్‌టీ-2 మొదలుపెట్టబోతున్నాను.ఆ భగవంతుడు నాతో పాటు నా జీఎస్‌టీ లవర్స్ వైపు ఉంటాడని ఆశిస్తున్నా' అంటూ వర్మ ట్వీట్ చేశారు.

వర్మలో మరో మనిషి.. నన్ను లైంగికంగా వేధించాడు: బాంబు పేల్చిన జయకుమార్

 మరో పోర్న్ స్టార్ తోనా?:

మరో పోర్న్ స్టార్ తోనా?:

జీఎస్‌టీ-2 అంటూ ప్రకటించేశాడు కానీ.. ఇందులోనూ మియా మాల్కోవానే చూపించబోతున్నాడా?.. లేక మరో పోర్న్ స్టార్‌తో చేయబోతున్నాడా? అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఏదేమైనా.. జనం వద్దన్న పని చేయడం వర్మకు కిక్ ఇచ్చే విషయం కాబట్టి.. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాల్ని ఆయన లెక్క చేయట్లేదు.

లైవ్ డిబేట్ లోనే పోర్న్ చూశాడా?, చివరి అనుభవమెప్పుడని సమరంకు వర్మ ప్రశ్న?..

సెర్చింజన్‌లో టాప్:

జనవరి 26వ తేదీ ఉదయం 9గం.కు 'జీఎస్‌టీ'కి ఎంత ట్రాఫిక్ పోటెత్తిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పట్ల చాలామంది ఆసక్తి కనబర్చడంతో.. ఒక్కసారిగా సైట్ క్రాష్ అయిపోయింది.

గడిచిన రెండు మూడు రోజుల్లో వేలాదిమంది జీఎస్‌టీ కోసం గూగుల్ సెర్చింజన్‌లో విపరీతంగా వెతికారు. ఇదే విషయాన్ని వర్మ సైతం తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. గూగుల్ సెర్చింజన్‌లో 'జీఎస్‌టీ' సెర్చ్ వర్డ్ టాప్‌లో ఉందని పేర్కొన్నారు.

దేవి గారు వింటున్నారా?: ఆర్జీవి

'లక్ష పైచిలుకు మంది #గాడ్‌సెక్స్&ట్రూత్ పోల్ లో పాల్గొంటే.. అందులో 73శాతం మంది సినిమాకు అనుకూలంగా ఉన్నారు. దేవి గారూ వింటున్నారా..' అంటూ వర్మ కామెంట్ చేశారు.

'గాడ్,సెక్స్&ట్రూత్' లీకైన ఫోటో ఇదే: వర్మ పక్కన న్యూడ్‌గా మియా మాల్కోవా..

తప్పు పడుతున్న దేవిప్రియ

తప్పు పడుతున్న దేవిప్రియ

సామాజిక కార్యకర్త దేవిప్రియ ఆర్జీవి 'జీఎస్‌టీ'ని తీవ్రంగా తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. రేటింగ్స్‌తో జనామోదాన్ని నిర్ణయించడం, అలాంటివన్నీ సమాజహితం కోసమేనని ప్రచారం చేసుకోవడం దారుణమని ఆమె బలంగా వాదిస్తున్నారు.

ఇండియాలో పోర్న్ మార్కెట్ పెంచడమే వర్మ లక్ష్యమని, అదే జరిగితే మహిళల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు వంటివి పెరిగిపోతాయని ఆమె ఆరోపిస్తున్నారు.

 వర్మ 'డోంట్ కేర్':

వర్మ 'డోంట్ కేర్':

ఎప్పటిలాగే సమాజం, సంస్కారం వంటి విషయాలను వర్మ డోంట్ కేర్ అనే చెబుతున్నారు. ఊహించినట్లుగానే 'జీఎస్‌టీ'కి విపరీతమైన స్పందన రావడంతో.. ఇప్పుడు జీఎస్‌టీ-2కి సిద్దమైపోయాడు. ఇండియాలో పోర్న్‌ను ఎలా క్యాష్ చేసుకోవాలో వర్మ చాలా ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తున్నాడనే చెప్పాలి.

ఇంకెంత దూరం:

ఇంకెంత దూరం:

స్త్రీ లైంగిక స్వేచ్చ గురించి చెప్పాలంటే ఆమెను నగ్నంగా చూపించాల్సిందేనా?.. ఒక సాధారణ సినిమాతో ఆ విషయాన్ని చెప్పలేరా? అని వర్మను చాలామంది ప్రశ్నిస్తున్నారు.

ఓషో లాంటి వాళ్లు ఇంకా చాలామంది ఆ విషయాన్ని ఎప్పుడో చెప్పారని, వర్మ ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదనేది కూడా చాలామంది వాదన. సరే, వర్మ ఎవరిని లెక్క చేయరు కాబట్టి మియాను నగ్నంగా చూపిస్తూ 'జీఎస్‌టీ' తీసేశారు. మరిప్పుడు సజీఎస్‌టీ-2'తో ఆ నగ్నత్వాన్ని ఇంకెంత దూరం తీసుకెళ్తారో చూడాలి.

English summary
Just two days after Ram Gopal Varma released online his controversial film "God, Sex and Truth" (GST), starring American pornstar Mia Malkova, the director on Monday announced that he will soon come up with “GST2”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu