twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీడియాకు క్షమాపణలు చెప్పిన రామ్ గోపాల్ వర్మ

    By Bojja Kumar
    |

    Ram Gopal Varma apologizes to Media
    హైదరాబాద్: 'ఐస్ క్రీమ్' సినిమాపై వచ్చిన నెగటివ్ రివ్యూ‌ల‌ఫై ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీడియాకు ఓ లేఖ రిలేజ్ చేసిన సంగతి తెలిసిందే. తన సినిమాలకు వ్యతిరేకంగా రివ్యూలు రాసిన వారిని వర్మ కుక్కతో పోల్చడంపై విమర్శలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వర్మ దిగిరా తప్పలేదు. తాను అందరు రివ్యూవర్లను అలా అనలేదని, జీరో రేటింగ్ ఇచ్చిన ఓ వైబ్ సైట్ గురించే అని, మిగతా వాళ్లను ఉద్దేశించి కాదు అన్నారు.

    "నేను రివ్యూవర్ల గురించి రాసిన ప్రెస్ నోట్ లో నేను ఉద్దేసించింది కేవలం ఆ పేరు మొహం కూడా దాచుకొని తిరిగే ఆ పిరికి --------(ఓ వెబ్ సైట్ పేరు) గురించి...అంతే కానీ కామన్‌గా రివ్యూవర్లందరిని ఇంకా వేరే మీడియావాళ్ళని కలిపి ఉద్దేశించింది కాదు. ఒకవేళ ఆ మూడ్లో తొందరలో నేను రాసిన దాంట్లో అలా వచ్చుంటే దానికి నా క్షమాపణలు. బొంబాయిలోనూ, హైదరాబాద్ లోనూ నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఎక్కువగా మీడియా వాళ్లు రివ్యూవర్స్ ఉన్నారు. అలాంటప్పుడు నేను ఉద్దేశ్యపూర్వకంగా అలాఅనటం అనేది జరగదు." అని వర్మ వ్యాఖ్యానించారు.

    ఇటీవల వర్మ విడుదల చేసిన ప్రెస్ నోట్లో....రివ్యూవర్లను తిట్టిన విషయాలు తొలిగించి ఆయన చెప్పిన మిగతా వివరాలు...

    సినిమా అనేది కథ, పెర్ఫార్మన్సెస్ టేకింగ్, సౌండ్ మొదలైన అంశాల సమ్మేళనం. ఆ సమ్మేళనం ఒక డైరెక్టర్ చేతిలో తన సెన్సిబిలిటీలో ఉంటుంది. ఆ సెన్సిబిలిటీకి కనెక్ట్ అవ్వనప్పుడు సినిమా నచ్చక పోవచ్చు. సినిమా హిట్టా, ఫ్లాపా అని విశ్లేషించడానికి కారణాలుంటాయి. ఎంత కాస్ట్ అయ్యింది, ఎంత రికవర్ అయ్యింది అనేది. ఎంతకి కొన్నారు, ఎంత వచ్చింది అనేది.. ఆ తరువాత ఒక ప్రేక్షకుడు ఆ సినిమా గురించి ఏమి ఫీల్ అయ్యాడు అనేది. పది మందిని అడిగితే పది రకాల అభిప్రాయాలు చెబుతారు. కానీ పేరు పేరున వేలమంది ఆడియన్స్ ని అడగలేం కనుక కాస్ట్ వర్సెస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఒక సినిమాకి కరెక్ట్ కొలబద్ద.

    వ్యక్తిగతంగా కొందరికి సూపర్ హిట్ సినిమా కూడా నచ్చకపోవచ్చు. కొందరికి సూపర్ ఫ్లాప్ సినిమా కూడా నచ్చొచ్చు. కానీ చివరికి బాక్సాఫీస్ నిర్ణయమే తుది నిర్ణయం అని ఇండస్ట్రీ గురించి ఏ మాత్రం ఓనమాలుతెలిసినోడైనా చెబుతాడు. పాటలు, స్టార్లు, ఫైట్లు, కామెడీ లేకుండా ఒకే ఒక్క లొకేషన్లో తీసిన ఐస్ క్రీం అనే సినిమాకి సూపర్ ఓపెనింగ్ రావడమే అందరికి షాక్ ఇచ్చింది.

    దీని మూలాన నేను ప్రూవ్ చేసిందేంటంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చెయ్యడానికి ప్రొడక్షన్ వాల్యూస్ అవసరంలేదని... ఐస్ క్రీం కి మేము పెట్టిన ఖర్చెంతంటే కేవలం ఒక్క రోజు కలెక్షన్లతో ప్రొడ్యూసరు,డిస్ట్రిబ్యూటర్లు వాళ్ల పెట్టుబడి రికవర్ చేసుకున్నారు. నేను ఐస్ క్రీం లో ప్రవేశ పెట్టిన ఫ్లో క్యాం, ఫ్లో సౌండ్ టెక్నాలజీ మున్ముందు ఒక ప్యారెలెల్ ఇండస్ట్రీని సృష్టిస్తుందని నా ప్రెడిక్షన్. నేను ఐస్ క్రీం లో ఇంట్రొడ్యూస్ చేసిన హై కాన్సెప్ట్-లో బడ్జెట్ ప్యారెలల్ సినిమా గాని, గింబల్ రిగ్ గాని ఎప్పటికీ ఉండిపోతాయి. దీనికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేనిక్కడ రాసింది చదివి వాళ్లు చేయగలిగేది కేవలం నా మీద ఇంకా రెట్టించిన ద్వేషంతో రెచ్చిపోయి రాయడం. . నేను ఏనుగుని కాకపోవచ్చు కానీ ఆ సమీక్షకుడు మాత్రం ఖచ్చితంగా ఒక కుక్క. సింహం గర్జిస్తే భయపడతానేమో గానీ చీకట్లోంచి మొరిగే కుక్క నాకు కేవలం చిరాకు తెప్పిస్తుంది... ఆఖరి మాటగా నేను చెప్పేదేంటంటే నేనిక్కడ రాసిందంతా కోపంతోనో ఆవేదనతోనో కాదు, కేవలం చిరాకుతో. -రాంగోపాల్ వర్మ

    English summary
    Director Ram Gopal Varma apologizes to Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X