»   » రామ్ గోపాల్ వర్మ భయపెట్టే రోజు అదే

రామ్ గోపాల్ వర్మ భయపెట్టే రోజు అదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ సారి ఖచ్చితంగా భయపెడతాను అంటూప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం ఆవహం గురించి చెప్తూ ప్రమోట్ చేస్తున్నారు. గతంలో ఆయన తీసిన ఫూంక్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రియల్ తొమ్మిదవ తేదీన రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.మిలింద్‌ గడాక్కర్‌ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందిన ఈ చిత్రం తమ గత చిత్రం 'రక్ష' కన్నా ఎక్కువ భయపెడుతుందనీ..ఇది 'భూత్‌' తరహా భయానక చిత్రమనీ ఆయన హామీ ఇస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ సమర్పణలో సార్థక్‌ మూవీస్‌ ప్రై.లిమిటెడ్‌, జడ్‌త్రీ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ 'ఆవహం' చిత్రం ఎలా మొదలైందో చెపుతూ..ఓ రోజు రచయిత మిలింద్‌ నన్ను కలవడానికి వచ్చాడు. 'రక్ష' సినిమాకు సీక్వెల్‌గా 'ఆవహం' చేద్దామంటూ ఓ ఐడియా చెప్పాడు. ఓపెనింగ్‌ ఎపిసోడ్‌ విని చాలా ఎగ్జైట్‌ అయ్యాను. వెంటనే 'ఆవహం' చేయాలని నిశ్చయించుకున్నాను అన్నారు.

'రక్ష' చిత్రంలో చేతబడిలాంటి క్షుద్రశక్తులు తెలిసిన ఒక మంత్రగత్తె తన స్వప్రయోజనాల కోసం ఓ చిన్నపిల్లని హింసిస్తూ చంపే ప్రయత్నంలో ఆ అమ్మాయి తండ్రిని అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. తన పాపను రక్షించుకునే ప్రయత్నంలో ఆ తండ్రి ఒక మంత్రగాణ్ణి కలిసి అతని సహాయంతో ఆమెను చంపుతాడు. 'ఆవహం' చిత్రకథ, ఆ చనిపోయిన మంత్రగత్తె ప్రేతాత్మ రూపంలో తిరిగొచ్చి, తన మరణానికి కారణమైన మంత్రగాణ్ణి చంపడంతో మొదలవుతుంది. 'రక్ష'లో రాజీవ్‌ కుటుంబం అనుభవించిన పరిస్థితుల కంటే కూడా అత్యంత దుర్భరమైన పరిస్థితులు 'ఆవహం'లో ఉంటాయి. ఎప్పుడైతే ఆ ప్రేతాత్మ మంత్రగాణ్ణి బలి తీసుకున్నప్పుడు, ఆ కుటుంబం పరిస్థితేంటి?అనేదే ఈ చిత్రం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X