twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బెజవాడ’-‘శివ’ సేమ్‌ కాదు...విప్పిచెప్పిన వర్మ, వివేక్

    By Bojja Kumar
    |

    నేను సృష్టించిన 'శివ" సినిమాలోని శివ క్యారెక్టర్ కి, వివేక్ సృష్టించిన 'బెజవాడ"లోని శివకృష్ణ క్యారెక్టర్ కి చాలా డిఫరెన్స్ ఉందని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. 1989లో 'శివ" రిలీజ్ అయినప్పుడు ఉన్న పరిస్థితుల నుంచి ఆ కథను, కథలోని క్యారెక్టర్స్ పుడితే...20 సంవత్సరాలుగా సినిమాల్లోనూ, బయటా మారుతూ వచ్చిన ఎన్నో పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వివేక్ తన స్టయిల్ లో 'బెజవాడ" సినిమా తీశాడని వర్మ చెప్పుకొచ్చారు.

    నేను ఆ టైంలో గాడ్ ఫాదర్, అర్జున్, అర్ధసత్య లాంటి సినిమాల నుంచి ఇన్ స్పైర్ అయితే...తను కూడా శివ, సర్కార్ లాంటి నా సినిమాలతో పాటు తనకిష్టమైన వేరే వేరే డైరెక్టర్స్ చాలా మందితో ఇన్ ఫ్లూయెన్స్ అయ్యాడు. కానీ, చివరికి తన యునీక్ స్టయిల్ లో తన పద్దతిలోనే బెజవాడ సినిమా తీశాడని, ఈ సినిమాకి సంబంధించి ఓ చిన్న ఉదాహరణ ఏమిటంటే 'శివ"లో చాలా పాపులర్ అయిన సైకిల్ ఛేజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని తీసుకొని తన స్టయిల్ లో మోడ్రనైజ్ చేసి 'బెజవాడ"లో వాడాడు..అని వర్మ చెప్పారు.

    దర్శకుడు వివేక్ కృష్ణ మాట్లాడుతూ...కొంత మంది సినీగోయర్స్, మీడియా వర్గాలు అనుకుంటున్నట్లుగా 'శివ" చిత్రానికి నా 'బెజవాడ" చిత్రానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ చిత్రంలోని శివ పాత్రకి నా చిత్రంలోని శివకృష్ణ పాత్రకి ఎటువంటి పోలికలు లేవు. 'శివ"లో నాగార్జున ఒక అండర్ డాగ్ గా మొదలై మెల్లగా ఒక హీరోగా ఎదుగుతాడు. కానీ, నా బెజవాడలో చైతన్య మొదట్నుంచీ హీరోయే. అలాగే బెజవాడ కథకి, శివ కథకి ఏమాత్రం సంబంధం ఉండదు. రామ్ గోపాల్ వర్మ చిత్రాల ప్రభావం నాపై ఉన్న మాట వాస్తవమే. కానీ, ఒక కొత్త దర్శకుడిగా నా పై చాలా మంది దర్శకుల ప్రబావం ఉంది. అందులో ఆయన కూడా ఒకరు తప్ప ఆయన ఒక్కరే కాదు. అలా నాపై ప్రభావం చూపిన దర్శకులు తీసిన సినిమాల్లోని సీన్లన్లు కొన్నింటిని, షాట్స్ కొన్నింటిని..అక్కడక్కడ నాకు నచ్చిన విధంగా 'బెజవాడ" చిత్రంలో కొత్తగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించాను అన్నారు.

    English summary
    Maverick director RGV is back to his old ways triggering strong reactions from political leaders to his film Bejawada.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X