»   » రాంగోపాల్ వర్మకు బాంబే కోర్టు షాక్.. గైర్హాజరుపై సీరియస్.. నాగ్ పరిస్థితేంటి!

రాంగోపాల్ వర్మకు బాంబే కోర్టు షాక్.. గైర్హాజరుపై సీరియస్.. నాగ్ పరిస్థితేంటి!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Ram Gopal Varma Officer Movie Release Postponed

  వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్లీ ఇబ్బందుల్లో పడ్డారు. ప్రస్తుతం అక్కినేని నాగార్జునతో రూపొందించిన చిత్రం ఆఫీసర్‌ విడుదలపై వాయిదా పడింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఆఫీసర్‌ విడుదలలో జాప్యం ఏర్పడినట్టు సమాచారం. రిలీజ్ వాయిదా వివాదం అక్కినేని నాగార్జునకు ఇబ్బందిగా మారే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి ఈ చిత్రం మే 25వ తేదీన విడుదల కావాల్సి ఉంది.

  వర్మపై వైటీ ఎంటర్‌టైన్‌మెంట్ పిటిషన్

  వర్మపై వైటీ ఎంటర్‌టైన్‌మెంట్ పిటిషన్

  తమకు వర్మ రూ.1.06 కోట్లు చెల్లించాలని వైటీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ తరుఫున బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ఎస్‌జే కథావాలా విచారించారు. చిత్ర హక్కులను, డిజిట్ రైట్స్, తదితర విషయాల్లో వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  విచారణకు హాజరుకాని వర్మ

  విచారణకు హాజరుకాని వర్మ

  ఐటీ ఎంటర్‌టైన్‌మెంట్ దాఖలు చేసిన పిటిషన్‌పై మే 4న కోర్టు విచారణ జరిపింది. ఆ సందర్భంగా వర్మ తరుఫు న్యాయవాది విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా తన క్లయింట్ వర్మ మే 7న జరిగే విచారణకు హాజరవుతారని వెల్లడించారు.

  గైర్హాజరుపై బాంబే కోర్టు సీరియస్

  గైర్హాజరుపై బాంబే కోర్టు సీరియస్

  మే 7న జరిగిన విచారణకు వర్మ బదులుగా సహ నిర్మాత సుధీర్ చంద్ర పదిరి హాజరుకావడంపై కోర్టు సీరియస్ అయింది. ఈ విచారణకు హాజరుకావాల్సిందేనని కోర్టు అదే రోజు 5 గంటలకు విచారణను వాయిదా వేసింది. అలాగే ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వర్మ హాజరుకాలేదు.

  ఆఫీసర్ రిలీజ్ వాయిదా

  ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ రూపొందించే చిత్ర విడుదల స్టే విధించింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీసర్ విడుదలను వాయిదా వేస్తూ వర్మ నిర్ణయం తీసుకొన్నారు. టెక్నికల్ సమస్యల వల్ల ఆఫీసర్ చిత్ర రిలీజ్‌ను జూన్ 1 తేదీకి వాయిదా వేశానని వర్మ ట్వీట్ చేయడం గమనార్హం.

  English summary
  Ram Gopal Varma is undoubtedly the most controversial director of TFI. He has been always on news either for his social media tweets or controversial films. He is currently gearing up for the release of Officer starring Nagarjuna, but now it landed in a trouble. The film’s release has been stayed by Bombay High court.\
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more