»   » మళ్ళీ కెలికాడు.... ఖైదీ పై మళ్ళీ వెటకారం చేస్తూ ట్వీట్

మళ్ళీ కెలికాడు.... ఖైదీ పై మళ్ళీ వెటకారం చేస్తూ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలిచే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు చిరంజీవీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మెగాస్టార్ 150వ చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150 ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన పోస్టర్ మీద సెటైర్లు వేసి అక్షింతలు వేయించుకున్న విషయం తెలిసిందే ఫస్ట్ లుక్ అదిరిపోయింద‌ని మెచ్చుకున్న రామ్‌గోపాల్ వ‌ర్మ‌.. చిరు కెరీర్‌లోనే అధ్భుత‌మైన ప‌స్ట్‌లుక్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు ఆర్జీవీ. అయితే గ‌తంలో చిరు 150వ సినిమాపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను వెనక్కి తీసుకుంటున్న‌ట్లు తెలిపి .. చిరంజీవి అభిమానులు త‌న‌ను క్ష‌మించాల్సిందిగా కూడా కోరాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. అక్కడితో ఆపేస్తే వర్మ ఎలా అవుతాడు... అందుకే ఇదిగో ఇలా మళ్ళీ ఒకసారి మెగా స్టార్ కొత్త లుక్ మీద ఇంకో సెటైర్ వేసాడు..

 Ram Gopal Varma Comments on Chiranjeevi Khaidi No 150 poster

ఇటీవల పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ 'కాటమరాయుడు' పోస్టర్‌గురించి ట్వీట్‌ చేసిన వర్మ ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి 'ఖైదీ నంబర్‌ 150' చిత్రం పోస్టర్‌పై కామెంట్స్‌ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌ను వర్మ ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ చాలా వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు. ఈ పోజ్‌ కోసం మేడం టుసాడ్స్‌ మ్యూజియం వారు తమ దగ్గర ఉన్న సగం విగ్రహాల్ని అవతల పారేస్తారన్నారు. మెగా స్టార్ ను ఈ పోజులో కూర్చోబెట్టిన డిజైనర్‌, దర్శకుడి పాదాలు తాకాలనుందని ట్వీట్‌ చేశారు. స్వానురక్తి, స్వయంప్రేమకు పరాకాష్ఠగా దీన్ని పేర్కొన్నారు. జర్మన్‌ తత్వవేత్త హెగెల్‌ ఉంటే మెగాస్టార్‌ను ముద్దాడేవారన్నారు. ఈ పోస్టర్‌ డిజైనర్‌తో పాటు, మెగాస్టార్‌ని ఈ పోజులో కూర్చోడానికి ఒప్పించిన ఇతరుల ఫోను నంబర్లు, చిరునామాలు తనకి కావాలని వర్మ అడగటం వెటకారానికి పరాకాష్ట. ఇప్పుడు చూడాలి మళ్ళీ మెగా ఫ్యాన్స్ వర్మ పైకి ఎదురు దాడి ఎలా చేస్తారో...

English summary
"Designer of this look is going to have a page forever in the annals of history for involuntary perpetuation and voluntary disorientation" tweeted Ram Gopal Varma, immediately after the new poster of “Khaidi No 150” got released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X