twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రంప్ కోసం బాలీవుడ్‌ నైట్‌ ఏర్పాటు చేస్తే బెటర్.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

    |

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై సంచలన కామెంట్స్ చేశాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వరుస ట్వీట్స్ చేస్తూ ఏకిపారేశారు. ట్రంప్‌పై తనదైన శైలిలో సెటైర్స్ వేస్తూ అట్టహాసంగా జరిగిన స్వాగత కార్యక్రమాలపై విరుచుకుపడ్డాడు. భారతీయుల్లో ఆలోచనలు రేకెత్తించేలా పలు కామెంట్స్ చేయడంతో ఈ ట్వీట్స్ వైరల్ అయ్యాయి. వివరాల్లోకి పోతే..

    ట్రంప్ పర్యటన.. అట్టహాసంగా ఏర్పాట్లు

    ట్రంప్ పర్యటన.. అట్టహాసంగా ఏర్పాట్లు

    ట్రంప్ భారత పర్యటన సందర్భంగా అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు . ప్రధాని మోదీతో కలిసి ట్రంప్ పర్యటన నేపథ్యంలో భారతీయులు అమెరికా, ఇండియా జెండాలు పట్టుకుని వారు ఇరువురికీ స్వాగతం పలికారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి మోతేరా క్రికెట్ స్టేడియం 22 కిలోమీటర్ల మేర ట్రంప్, ప్రధాని మోదీ రోడ్‌ షోలో వారికి స్వాగతం పలుకుతూ అహ్మదాబాద్ రోడ్లపైకి జనం వచ్చారు.

    Recommended Video

    If Sunny Leone Stand Next To Trump 10 Million People Welcome Him | Filmibeat Telugu
    కోట్లలో ధనం.. వెల్లువెత్తుతున్న విమర్శలు

    కోట్లలో ధనం.. వెల్లువెత్తుతున్న విమర్శలు

    డొనాల్డ్ ట్రంప్ పర్యటన కోసం భారత్ కోట్లలో ధనం ఖర్చుపెడుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పర్యటన వల్ల భారత దేశానికి ఒరిగేదేమీ లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు ట్రంప్ పర్యటన వల్ల ఉపయోగం ఏంటంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

     మాటలకు పదును పెట్టిన వర్మ.. సెన్సేషన్

    మాటలకు పదును పెట్టిన వర్మ.. సెన్సేషన్

    మరోవైపు రామ్ గోపాల్ వర్మ ట్రంప్ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ విమర్శలు గుప్పించాడు. మొన్నటికి మొన్న ట్రంప్ అహ్మదాబాద్‌లో తనకు కోటి మంది స్వాగతం పలుకుతారని వ్యాఖలు చేసిన నేపధ్యంలో అమితాబ్ బచ్చన్ , అమీర్ ఖాన్, దీపికా పదుకొనే, సన్నీలియోన్ వంటి వారు కూడా ట్రంప్‌తో కలిసి వస్తే అప్పుడు కోటి మంది వస్తారేమో అని సెటైర్ వేసిన వర్మ.. ఈ సారి తన మాటలకు పదును పెట్టేశాడు.

    ఆలోచనలు రేకెత్తించిన వర్మ

    ఆలోచనలు రేకెత్తించిన వర్మ

    ట్రంప్‌ను ఇండియాకు ఆహ్వానించడానికి మనం వేలకోట్లు ఖర్చు చేశాం కానీ ప‍్రధాని నరేంద్ర మోడీని అమెరికాకు స్వాగతించడానికి అమెరికన్లు వేల రూపాయలైనా ఖర్చు చేస్తారా..? అని వర్మ ప్రశ్నించారు. అంతేకాదు అది అమెరికా, భారత్‌ కాదు అంటూ తనదైన శైలిలో ట్వీట్ ఆలోచనలు రేకెత్తించాడు వర్మ.

    అసలు కారణం అదే.. అందుకే ఇండియా వచ్చాడు

    అసలు కారణం అదే.. అందుకే ఇండియా వచ్చాడు

    ఇకపోతే ట్రంప్ ఇండియాకు రావటానికి గల కారణం కూడా చెప్పాడు వర్మ. తను ఇండియా వస్తున్నాడంటే ఎంతమంది అతన్ని చూడటానికి వస్తారో అని తెలుసుకోవడానికి మాత్రమే ట్రంప్ వస్తున్నాడని.. దీనిని ఆయన చనిపోయే వరకు గొప్పగా చెప్పుకుంటాడని వర్మ పేర్కొన్నాడు. తన కోసం 10 మిలియన్ల మంది వస్తే ట్రంప్‌ 15 మిలియన్ల జనాలు వచ్చారని ట్రంప్ అబద్ధం చెప్పుకుంటాడంటూ మరో ట్వీట్ చేశాడు వర్మ.

    వర్మ ట్వీట్స్.. చర్చల్లో జనం

    ఆ వెంటనే మరో ట్వీట్ చేసిన వర్మ.. ''భారతీయులే మన సాంసృతిక కార్యక్రమాలను చూడరు అలాంటిది ట్రంప్ ఎందుకు చూస్తారు. దీని కంటే ఓ బాలీవుడ్‌ నైట్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేయడం మంచిది'' అంటూ వర్మ ఎద్దేవా చేశారు. దీంతో వర్మ చేసిన ఈ ట్వీట్ హాట్ హాట్ చర్చలకు కారణమయ్యాయి.

    English summary
    US President Donald Trump india visit highlighted. Ram Gopal Varma reacted and put his comments on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X