twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లోకేష్, జగన్, రాంచరణ్‌ లేరా? వైఎస్, బాబు, చిరుపై వర్మ హాట్ కామెంట్స్.. సుశాంత్‌ ఫ్లాప్ హీరో..

    |

    యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నెలకొన్న బాలీవుడ్ పరిస్థితులపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. నెపోటిజం అనేది అన్ని రంగాల్లో ఉంది. ఏ ఒక్క సినిమా పరిశ్రమకు సంబంధించి కాదు. తన కుటుంబంలోని సభ్యుడిని ప్రోత్సహించుకోవడమనే విషయం కొత్తేమీ కాదు. కాబట్టి ఆ ఆరోపణలు పనిలేని వాళ్లు పబ్లిసిటీ కోసం చేసే ప్రచారం అంటూ వర్మ కామెంట్లు చేశారు. ఆయన నెపోటిజం గురించి మాట్లాడుతూ..

    Recommended Video

    Nepotism : Ram Gopal Varma కామెంట్స్ On Nepotism In Film Industry , Politics
    బంధుప్రీతితో ప్రతిభను తొక్కేస్తున్నారు?

    బంధుప్రీతితో ప్రతిభను తొక్కేస్తున్నారు?

    బంధుప్రీతితో ప్రతిభను తొక్కేస్తున్నారనే ఆరోపణలకు నేను పూర్తిగా వ్యతిరేకం. ప్రతీ ఇంట్లో వారి పిలల్ని ప్రోత్సహించుకోవడమనేది ఇప్పటి వ్యవహారం కాదు. ఎప్పటి నుంచో కొనసాగుతున్నది. లోకేష్‌కు చంద్రబాబు, వైఎస్ జగన్‌కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని అప్పగించారు. అందులో తప్పేమీ లేదు. వారి ఛాయిస్ ప్రకారం.. వారికి ఉన్న ఫాలోయింగ్‌కు అనుకూలంగా ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయి. దానికి నెపోటిజమని పేరుపెట్టి గగ్గోలు పెట్టడం సరికాదు అని వర్మ చెప్పారు.

    రాంచరణ్‌ను చిరంజీవి ప్రొత్సహిస్తే..

    రాంచరణ్‌ను చిరంజీవి ప్రొత్సహిస్తే..

    చిరంజీవి తన కుమారుడు రాంచరణ్‌ను ఇంట్రడ్యూస్ చేయడంలో తప్పేంటి? తన కుమారుడిని ప్రోత్సహించుకోకపోతే పక్కింటి వాడి కొడుకును పరిచయం చేస్తాడా? నెపోటిజం అనేది పనిలేని వాళ్లు చేసే పనికిమాలిన ఆరోపణలు. తమ కుమారులు సక్సెస్ అవుతారా? లేదా ఫెయిల్ అవుతారా అనేది వాళ్లకు సంబంధించిన సమస్య అని రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.

     స్టార్ కిడ్స్ గురించి

    స్టార్ కిడ్స్ గురించి

    బయట నుంచి వచ్చే హీరోల కంటే సినీ ఇండస్ట్రీలోని హీరోల కుమారులకు సానుకూలత ఉంటుంది. అప్పటికే హీరోలకు ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల దానిని క్యాష్ చేసుకోవడానికి హీరోలు తమ కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు. బయటవారిని పరిచయం చేస్తే తొలి సినిమాకు వారెవరో కూడా తెలియదు. దాని వల్ల పెద్ద ఉపయోగం ఉండదు అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

    విజయ్ దేవరకొండకు ఏ బ్యాగ్రౌండ్ ఉంది

    విజయ్ దేవరకొండకు ఏ బ్యాగ్రౌండ్ ఉంది

    ఇక విజయ్ దేవరకొండకు ఏ బ్యాగ్రౌండ్ ఉంది? ఆయన తండ్రి ఎవరికైనా తెలుసా? తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకొని సూపర్‌స్టార్ అయ్యారు. హీరోల కొడుకుల సినిమాలు నడుస్తాయా? బయట నుంచి వచ్చిన హీరోల సినిమాలు నడుస్తాయా అనేది హీరోలు డిసైడ్స్ విషయం కాదు. స్టార్ ఎవరవ్వాలనేది, వారి సినిమాలు నడుస్తాయా లేదా అనేది ఆడియెన్స్ డిసైడ్ చేస్తారు. చాలా మంది హీరోల పిల్లలు తమ హీరోలను స్టార్ చేయలేకపోయారనేది అందరికీ తెలిసిందే అని వర్మ స్పష్టం చేశారు.

    సుశాంత్ ఫెయిల్యూర్ కాదు

    సుశాంత్ ఫెయిల్యూర్ కాదు

    బాలీవుడ్ సుశాంత్ విషయంలో తప్పు ఎవరిదనేది పక్కన పెడితే.. ఆయన ఎఫ్పుడూ ఫెయిల్యూర్ కాదు. ఆయనను ఫ్లాప్‌ హీరోగా పరిగణించకూడదు. హిందీలో టాప్ 15 స్టార్ హీరోల్లో ఒకరిగా ఉంటారు. అయితే తాను ఫెయిల్యూర్ అనే విషయాన్ని సుశాంత్ నిర్ధారించుకొన్నారా అనే ప్రశ్నలకు సమాధానం లేదు అని వర్మ పేర్కొన్నారు.

    కరణ్‌తో నాకు శత్రుత్వం

    కరణ్‌తో నాకు శత్రుత్వం

    కరణ్ జోహర్‌కు నాకు 20 ఏళ్ల నుంచి శత్రుత్వం ఉందనేది వేరే విషయం. కాకపోతే రెండు దశాబ్దాల కాలంలో ఇండస్ట్రీకి చాలా హిట్లు అందించారు. ఇప్పుడు ఆయన టాప్ ప్రొడ్యూసర్. ఆయన ఎవరిని పెట్టి సినిమా తీయాలనేది ఆయన ఇష్టం. స్టార్ పిల్లలకు అవకాశం ఇస్తారా? బయటి వ్యక్తులకు ఆఫర్లు ఇస్తారా? నిర్మాతగా తన ఛాయిస్ అని వర్మ అభిప్రాయపడ్డారు.

    English summary
    Director Ram Gopal Varma made comments on nepotism in film industry and politcs. He said, Audience are the kings to decide the Who to become star and Who not. This comment made the situation prevail after sushant's suicide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X