»   » సన్నీ పేరు చెప్తూ సానియా నీ వివాదం లోకి లాగాడు, అండర్వేర్ ఫొటో పొస్ట్ చేసిన వర్మ

సన్నీ పేరు చెప్తూ సానియా నీ వివాదం లోకి లాగాడు, అండర్వేర్ ఫొటో పొస్ట్ చేసిన వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను ట్విటర్ నుంచి వెళ్ళిపోతున్నా అని వర్మ చెప్పినప్పుడు కొందరు అనుమానంగానే చూసారు., ఆ ఇది అయ్యే పని కాదు అనుకున్నారు కానీ నిజంగానే వర్మ ట్విటర్ మూసేసే సరికి అవాక్కయ్యారు, ఇంకొందరు పీడా పోయింది అనుకున్నారు. అయితే అలా అనుకున్నవాళ్ళకి ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవనివ్వలేదు వర్మ వెంటనే ఇన్స్టా గ్రాం ఓపెన్ చేస్తున్నా అంటూ ప్రకటించి షాకిచ్చాడు.... ఇన్నాళ్ళూ అక్షరాలతో ఆడుకొని బోరు కొట్టిందేమో ఇక ఫొటోలతో మొదలు పెట్టాడు...

సర్కార్ 3 ధారుణ పరాజయం

సర్కార్ 3 ధారుణ పరాజయం

మొన్నటికి మొన్న సర్కార్ 3 ధారుణ పరాజయం తర్వాత అంతా వర్మ వైపు జాలిగా చూస్తూంటే జాలీగా తన వెబ్ సిరీస్ గన్స్ అండ్ థైస్ ని పోస్ట్ చేసి తన గీర ఏమిటో చూపించాడు. అస్లు సినిమా లోనే దారుణం అనిపించే వర్మ ఇక ఈ ట్రైలర్ తో భయానకం, భీబత్సం లని కూడా దాటిపోయాడు.

మేరీ భేటీ సన్నీలియోన్‌ బనానా చాహ్‌తా హై

మేరీ భేటీ సన్నీలియోన్‌ బనానా చాహ్‌తా హై

ఆవెంటనే ‘మేరీ భేటీ సన్నీలియోన్‌ బనానా చాహ్‌తా హై' అంటూ తీసిన ఒక షార్ట్ ఫిలిం ని వదిలాడు ఇంకేముందీ జనాలకి పిచ్చెక్కింది, మరీ అంత పచ్చి నిజాలని తట్టుకోలేకపోయారు. నిజానికి ఆ షార్ట్ ఫిలిమ్ లో స్త్రీ తన స్వతంత్రాన్నీ, తనకంటూ ఉండే ఒక హక్కునీ ఎలా కోల్పోతుందో చెప్పాలనుకున్న వర్మ "తన స్టైల్లో" చెప్పేసరికి అది వివాదాస్పదం అయ్యింది.

షార్ట్ ఫిలిం

షార్ట్ ఫిలిం

ఏదైనా ఎక్స్ట్రీమ్ గా చేసే వర్మ ఇప్పుడు చూపించి షార్ట్ ఫిలిం కూడా అలాగే చేసాడు అతను అనుకున్నట్టే విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది, సర్కార్ పోయిందీ అన్న భాదకూడా కనిపించకుండా పోయింది.. ఇప్పుడు తన షార్ట్ ఫిలిం మీద వచ్చే విమర్శలనీ, మెచ్చుకోళ్లనీ, స్పందనలనీ ఎంజాయ్ చేస్తున్నాడు వర్మ... ఇప్పుడు ఏం చేసాడనే కదా. మీ ఆసక్తి..!?

ఓ అమ్మాయి మెసేజ్‌ చేసింది

ఓ అమ్మాయి మెసేజ్‌ చేసింది

ఆసలు ఆ సినిమా తాను ఎందుకు తీశానో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చెప్పాడు వర్మ. ‘నేను ఇటీవల తీసిన ‘మేరీ భేటీ సన్నీలియోన్‌ బనానా చాహ్‌తా హై'.. తనకు గతం గుర్తుచేసిందని ఓ అమ్మాయి ఇటీవల నాకు మెసేజ్‌ చేసింది. ఆ అమ్మాయి గతంలో ఎంతో మంచి టెన్నిస్‌ ప్లేయర్‌ అట.

తండ్రి ఆమెను టెన్నిస్‌ అడనివ్వలేదట

అయినప్పటికీ ఆ అమ్మాయి యుక్త వయసుకొచ్చాక ఆమె తండ్రి ఆమెను టెన్నిస్‌ అడనివ్వలేదట. దానికి కారణం ఆ ఆటలో భాగంగా పొట్టి స్కర్టులు వేసుకోవాల్సి రావడమే. ఇలాంటి భావాలతో మహిళలను అణగదొక్కే సుంకుచిత మనస్తత్వాలను గురించి చెప్పేందుకే నేను ఈ షార్ట్‌ ఫిల్మ్‌ తీశాన'ని చెప్పాడు వర్మ. కంటెంట్‌ బాగానే ఉన్నప్పటికీ ఆయన షేర్‌ చేసిన సానియా ఫోటో కాస్త వివాదాస్పదంగా మారింది.

English summary
"A girl told someone,MBSLBCI reminded her of,though she was very good at Tennis her father refused to permit her to play beyond a age because she will have to wear skirts ..The film is about exposing these regressive minds who use a girl's sexuality against herself" Posted Varma in his Instagram
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X