twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వంగవీటి మోహన్ రంగా సరే..ఇవన్నీ వర్మ చూపెడతారా?

    By Srikanya
    |

    హైదరాబాద్: కిల్లింగ్ వీరప్పన్ సక్సెస్ తో ఉత్సాహంతో ఉన్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీసారు. గతంలో అనంతపురం ఫ్యాక్షన్ గొడవలను ‘రక్త చరిత్ర' సినిమాగా తీసి హిట్ కొట్టిన వర్మ ఇప్పడు వంగవీటి మోహన్ రంగా జీవితంపై సినిమా మొదలెట్టపబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ ద్వారా తెలియచేసారు.

    రంగా రాజకీయ ఆరంగ్రేటం మొదలు రంగా హత్యకు దారితీసిన పరిణామాలు, రంగా హత్యతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వర్మ తన సినిమాలో చూపించనున్నాని చెప్తున్నారు.

    రంగా సోదరుడు రాధాకృష్ణ హత్యతో ఈ కథ ప్రారంభమై రంగా హత్యతో ముగుస్తుందని వర్మ తెలిపారు.

    నిజానికి పరిటాల కంటే వంగవీటి రంగాది మరింత సినిమాటిక్ జీవిత కథ. మరి రంగా చరిత్ర సినిమాగా ఇంతకాలం ఎండుకు రాలేదు? అందుకు సామాజిక వర్గాలకు సంబంధించిన అనేక చిక్కుముడులు ఉన్నాయి. కమ్మ- కాపు లీడర్ల మధ్య, గ్రూపుల మధ్య విజయవాడ చరిత్ర నడిచింది. మధ్యలో కమ్యూనిస్టుల పాత్ర కొంత ఉంటుంది.

    Ram Gopal Varma Confirmed His Next On ‘Vangaveeti Mohan Ranga’

    కాపు, ఇతర అణగారిన వర్గాల గ్యాంగ్ లీడర్ అయిన రంగా కమ్మ కులానికి చెందిన రత్నకుమారిని ప్రేమించి పెళ్ళి చేసుకోవడం, గ్యాంగ్ వార్ లో మరణించిన అన్న పేరు కొడ్డుక్కి పెట్టుకోవడం, కమిషనర్ గా వచ్చిన కెఎస్ వ్యాస్ రంగాను తిప్పలు పెట్టడం, ఆ తర్వాత నిరాహారదీక్షా శిబిరంలోనే హత్యకు గురికావడం, పర్యవసానంగా కింది వర్గాల ప్రజల ఒక భూస్వామ్య కులంపై దాడి చేయడం ఎంతో ఉత్కంఠ భరితమైన అంశాలు రంగా కథలో ఉన్నాయి. తమిళ యాక్షన్ సినిమాల రేంజ్ లో ఉండే ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలున్నాయి.

    English summary
    RGV said: "My next film’s name is “Vangaveeti” . Film starts with the raise of Radha and ends with the death of Ranga..That’s why I am calling the film “Vangaveeti”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X