twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈసారి 2.0పై పడ్డ వర్మ.. శంకర్‌ని వెటకారంగా, పబ్లిసిటీ కోసం ఎంతకైనా!

    |

    వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే. పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఎలాంటి వ్యాఖ్యలైనా సులువుగా చేసేసి ఆ తరువాత తనదైన శైలిలో వివరణ ఇచ్చుకుంటారు. వర్మ చాలా మంది సెలెబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు రాంగోపాల్ వర్మ తన సినిమా పబ్లిసిటీ కోసం ట్విట్టర్ వైదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సమర్పణలో వస్తున్న భైరవ గీత చిత్ర ప్రచారం కోసం వర్మ 2.0 చిత్రాన్ని, దర్శకుడు శంకర్ ని టార్గెట్ చేశాడు.

    ఫ్యాక్షన్ నేపథ్యంలో

    ఫ్యాక్షన్ నేపథ్యంలో

    రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో భైరవ గీత చిత్రం తెరకెక్కుతోంది. నవంబర్ 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి రాంగోపాల్ వర్మ శిష్యుడు సిద్దార్థ దర్శకుడు. ఈ చిత్రంలో ధనంజయ, ఇరా మోర్ జంటగా నటిస్తున్నారు. లవ్, క్రైమ్ కథకు ఫ్యాక్షన్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం పూర్తిగా వర్మ శైలిలో తెరకెక్కినట్లు తెలుస్తోంది.

    వెటకారపు ట్వీట్స్

    రాంగోపాల్ వర్మ ఈ చిత్ర ప్రచారం కోసం 2.0 చిత్ర దర్శకుడు శంకర్ ని టార్గెట్ చేసారు. భైరవ గీత దర్శకుడు సిద్దార్దని, శంకర్ ని పోలుస్తూ వెటకారపు వ్యాఖ్యలు చేశారు. పబ్లిసిటీ కోసం వర్మ ఎప్పుడూ ఒకే పద్దతిని ఫాలో అవుతున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

    దండం పెడుతున్న శంకర్

    చిన్న మేకపిల్ల లాంటి దర్శకుడు సిద్దార్థ.. డైనోసార్ లాంటి శంకర్ కు ఎదురెళుతున్నాడు అంటూ ఓ కామెంట్ పెట్టాడు. 2.0 చిత్రం నవంబర్ 29న విడుదల అవుతుండగా 30న భైరవ గీత చిత్రం విడుదలవుతోంది. ఈ విషయాన్ని వర్మ పరోక్షంగా ఇలా తెలిపాడు. యువ దర్శకుడు శిద్ధార్థకు శంకర్ దండం పెడుతున్నట్లు ఫోటో పెట్టి.. శంకర్ సిద్దార్దని గేలి చేస్తున్నాడు అంటూ మరో కామెంట్ పెట్టాడు.

    పోటీ తట్టుకోవాలంటే

    పోటీ తట్టుకోవాలంటే

    రాంగోపాల్ వర్మ చేసే వ్యాఖ్యలే అతడి చిత్రాలకు హైప్ తీసుకుని వస్తుంటాయి. 2.0 చిత్రం కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. శంకర్, రజనీల పోటీ తట్టుకోవాలంటే వర్మ సమర్పణలో వస్తున్న భైరవ గీత చిత్రంలో మంచి కంటెంట్ ఉండాల్సిందే.

    English summary
    Ram Gopal Varma controversial tweets on Director Shankar. Bhairava Geetha will release on November 30.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X