twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తివిక్రమ్‌ను నిందించొద్దు.. పవన్‌పై ట్వీట్లు.. వెంటనే తోకముడిచిన వర్మ

    By Rajababu
    |

    Recommended Video

    పవన్‌పై వర్మ ట్వీట్.. వెంటనే డిలీట్..?

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు రాంగోపాల్ వర్మ మధ్య గత కొద్దికాలంగా ట్విట్టర్ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' ఇటీవల ఆర్జీవి విమర్శనాస్త్రాలను ట్వీట్ల రూపంలో సంధించారు. అయితే అలాంటి ట్వీట్లను వెంటనే డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.

    ట్వీట్లన తొలగించిన వర్మ

    ట్వీట్లన తొలగించిన వర్మ

    దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒకసారి పోస్టు చేసిన తర్వాత తన ట్వీట్లను తొలగించడం లాంటి పనులు చేయరు. అయితే తాజాగా పవన్ కల్యాణ్‌పై చేసిన ట్వీట్లు డిలీట్ చేయడంతో ఇన్‌సైడ్‌గా ఏదో జరిగి ఉంటుంది అనే వాదన ఫ్యాన్స్‌లో మొదలైంది. ఇంతకీ పవన్ కల్యాణ్ గురించి వర్మ ఏం కామెంట్ చేశారంటే..

    త్రివిక్రమ్‌ను నిందించొద్దు

    త్రివిక్రమ్‌ను నిందించొద్దు

    ‘అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ అయినందుకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను నిందించవద్దు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు ఉన్న చరిష్మా, ఇమేజ్‌కు ప్రపంచంలోని ఏ దర్శకుడైనా న్యాయం చేయలేడు అని వర్మ ట్వీట్ చేశారు.

    ఏ డైరెక్టర్ కూడా కాపాడలేరు

    ఏ డైరెక్టర్ కూడా కాపాడలేరు

    ప్రపంచంలోని దిగ్గజ డైరెక్టర్లు స్టీవెన్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కామెరాన్, క్రిస్టఫర్ నోలాన్ లాంటి వారు కూడా పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తే విఫలం కావొచ్చు. వారు కూడా ఆయన ఇమేజ్‌కు అనుగుణంగా సినిమా తీయలేకపోవచ్చు అనే అనుమానాన్ని వర్మ వ్యక్తం చేశాడు.

    పవన్‌ కల్యాణ్‌పై వర్మ సెటైర్లు

    పవన్‌ కల్యాణ్‌పై వర్మ సెటైర్లు

    పవన్ కల్యాణ్‌పై ఇలా ట్వీట్లు చేయడం వెనుక రాంగోపాల్ వర్మ ప్రశంసల కంటే చురకలే ఎక్కువగా కనిపించాయి. అయితే ట్వీట్లు చేసిన తర్వాత ఏమైందో ఏమో వెంటనే వాటిని వర్మ తొలగించారు.

    గాడ్, సెక్స్, ట్రూత్‌ ప్రమోషన్‌లో వర్మ

    గాడ్, సెక్స్, ట్రూత్‌ ప్రమోషన్‌లో వర్మ

    ప్రస్తుతం రాంగోపాల్ వర్మ ట్విట్టర్ టైమ్‌లైన్‌పై గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ ప్రమోషన్ వీడియోలు, చిత్రాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఈ షార్ట్ ఫిలిం జనవరి 26న విడుదల కానున్నది.

    English summary
    Ram Gopal Varma tweeted that one should not blame Trivikram for the movie’s flop because no director in the world would do justice to Pawan Kalyan’s charisma and image. Even the biggest directors in the world like Steven Spielberg, James Cameron and Christopher Nolan would fail when they work with Pawan Kalyan, he tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X