twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముంబైలో వర్మ పోటీ దీక్ష, బెజవాడపై కేసు వేస్తానని హెచ్చరిక

    By Srinivas
    |

    బెజవాడ రౌడీలు చిత్రంపై తాను వెనక్కి తగ్గేది లేదని ఆ చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఎవరో పని పాట లేని వారు చేసే దీక్షకు తాను సమాధానం చెప్పవలసిన అవసరం లేదన్నారు. కథ తెలియకుండా, సినిమా చూడకుండా కేవలం టైటిల్ చూసి ఇలా రాద్దాంతం చేయడం సరికాదన్నారు. వారు తన చిత్రం పేరును మార్చాలని దీక్ష చేస్తే తాను కూడా పేరు మార్చేదే లేదని ముంబైలోనే దీక్ష చేస్తున్నానని చెప్పారు. ప్రపంచంలో అంతటా రౌడీలు ఉంటారని బెజవాడ రౌడీలు అని పేరు పెట్టినంత మాత్రాన బెజవాడ మొత్తం రౌడీలు అని అర్థం కాదన్నారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో అసెంబ్లీ రౌడీ చిత్రం వచ్చినంత మాత్రాల అసెంబ్లీలోని వారంతా రౌడీలా అని ప్రశ్నించారు.

    అయినా సినిమా చూసి సర్టిఫికేట్ ఇవ్వడానికి సెన్సారు బోర్డు ఒకటుందని అన్నారు. వారు సినిమా చూస్తే అభ్యంతరకరంగా ఏమైనా ఉంటే వారే అనుమతించరని అన్నారు. తాను కూడా ముంబైలో దీక్ష చేస్తున్నానని చెప్పారు. తనకు అనుకూలం అయిన చోట దీక్ష చేస్తానని చెప్పారు. ఎవరో పనికి మాలిన వారు అభ్యంతరాలు చెబుతుంటే తాను వెనక్కి తగ్గనని వారిపై కేసు వేయడానికి కూడా సిద్ధమని హెచ్చరించారు. తనకు సమయం వచ్చినప్పుడు విజయవాడ వస్తానని చెప్పారు. చిత్రం పేరును మార్చాలని ఇలా ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తూ పోతే ఎలా అని ప్రశ్నించారు. దీక్ష చేసే వాళ్లు ఎవరో తనకు తెలియదని, వారికి ఇష్టం లేకుంటే సినిమా చూడవద్దన్నారు. పబ్లిసిటీ కోసమే వారు ఇలా దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.

    English summary
    Cine director Ram Gopal Varma did not take back step on Bejawada Roudilu title. He blamed those who are fasting for change the title.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X