ఆర్జీవి దీపావళి: సెక్స్ కంటే అదే ఎక్కువ ఇష్టం.. కావాలంటే కామాన్ని ఇలా చెక్ చేయండి

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా సంచలనమే అనేలా అడుగులు వేస్తుంటాడని మరోసారి నీరూపించారు. ఏదైతే చేయవద్దు అంటారో అదే పనిగట్టుకొని చేస్తుంటాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆర్జీవి ఈ సారి దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన కొన్ని వీడియోలను కూడా షేర్ చేసుకున్నడు.

వర్మతో ఈ యాంగిల్ కూడా ఉందా

వర్మతో ఈ యాంగిల్ కూడా ఉందా

రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ లోనే అడల్ట్ సినిమాలతో కాస్త గట్టిగానే హడావుడి చేశాడు. ప్రమోషన్స్ విషయంలో డోస్ అంతకంతకు పెంచుతూనే ఉన్నాడు. ఇక చాలా రోజుల తరువాత వర్మ దీపావళి సెలబ్రేట్ చేసుకొని ఫాలోవర్స్ కి షాక్ ఇచ్చాడు. వర్మతో ఈ యాంగిల్ కూడా ఉందా అనేలా ట్విస్ట్ ఇచ్చాడు. ఆఫీస్ ముందు కూడా టపాసులు పేల్చుతూ హడావుడి గట్టిగానే చేశాడు.

సెక్స్ కంటే అదే ఎక్కువ ఇష్టం

వర్మ ఏం మాట్లాడినా కూడా బోల్డ్ గా ఉంటుందని అందరికి తెలిసిందే. ముఖ్యంగా సెక్స్ అనే టాపిక్ ని ఎంతగా హైలెట్ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక దీపావళి రోజు చిచ్చుబుడ్డి వెలిగిస్తూ.. నేను పవర్ ని సెక్స్ కంటే ఎక్కువగా ఇష్టపడతాను అంటూ.. క్రాకర్ మీద ఉన్న కామాన్ని నా కళ్ళల్లో చెక్ చేయండి అంటూ వివరణ ఇచ్చాడు. దీంతో నెటిజన్లు కూడా విభిన్నంగా స్పందిస్తున్నారు.

ఆర్జీవి బోల్డ్ కామెంట్స్

ఇక మరొక వీడియోలో షాట్స్ క్రాకర్ ని కాల్చిన వర్మ బోల్డ్ గా మరో క్లారిటీ ఇచ్చారు. నేను లో కెమెరా యాంగిల్ ను కేవలం అమ్మాయిల దగ్గర మాత్రమే పెట్టను.. అమ్మాయిలా ఉండే దివాలి క్రాకర్ కింద కూడా పెడతానని అన్నాడు. అలాగే ఆ బాంబ్ యొక్క కింది భాగాన్ని చూడండి అంటూ మరొక బోల్డ్ కామెంట్ చేశాడు ఆర్జీవి.

Recommended Video

Chiranjeevi Tests Positive For COVID-19, Under Home Quarantine | Filmibeat Telugu
పండగరోజు తల్లికి వోడ్కా..

పండగరోజు తల్లికి వోడ్కా..

వర్మ తన దగ్గర ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండవని బయటకు చెబుతాడు గాని.. అతను తల్లికి సోదరికి చాలానే ఇంపార్టెన్స్ ఇస్తాడాని చాలా సందర్భాల్లో ఋజువయ్యింది. ఆర్జీవి తల్లి కూడా చాలా సార్లు ఆ విషయాన్ని చెప్పారు. ఇక దీపావళి సందర్భంగా తల్లితో సోదరితో ఉన్న ఫోటోని పోస్ట్ చేశాడు వర్మ. అంతే కాకుండా పండగరోజు ఆ ఇద్దరికి వోడ్కా రుచి చూపించాలని ప్రయత్నం చేసినట్లు ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X