For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్మ విడాకులు మ్యాటర్ పై మాజీ భార్య

By Srikanya
|

హైదరాబాద్ : నేటి వరకూ ఏ పత్రికకు కానీ ఏ ఛానెల్ కు కానీ కనపడటానికి ఇష్టపడని వర్మ మాజీ భార్య రత్నగారు మా ఈ పుస్తకం కోసం ఇంటర్వూ ఇచ్చారు. కాఫీ విత్ వర్మాస్ వైఫ్ అనే ఆ ఛాప్టర్ లో వర్మ గురించి అనేక ఆసక్తికర విషయాలు,ఎవ్వరూ ఊహించని కోణాలు,విడాకులకి గల కారణాలు అన్నీ రత్నం గారి మాటల్లోనో యధాతధంగా రాసాను అంటున్నారు సిరాశ్రీ. ఆయన తాజాగా వర్మ ట్వీట్స్ అన్నీ కలిపి సంకలనం చేస్తూ వోడ్కా విత్ వర్మ అనే పుస్తకం విడుదల చేస్తున్నారు. ఇందులో విశేషాలను వివరిస్తూ ఇలా స్పందించారు.

మరో షాకింగ్ సర్పైజ్ ఏమిటంటే వర్మ కుమార్తె రేవతి మనోగతం డెవిల్స్ డాటర్ అనే ఛాప్టర్ లో రాసాను. ఆమెను డెవిల్స్ డాటర్ అని ఎందుకు అన్నానో ఆ ఛాప్టర్ చదివితే గానీ మీకు అర్దం కాదు. ఇక వర్మ ట్విట్టర్ లో తరచూ చిరంజీవి గురించి ఎందుకు ప్రస్దావిస్తూంటారు...నా ఇష్టం లో తనని కెలికినందుకు ఒక దర్శకుడు వర్మ పట్ల ఎలా మండిపడ్డారు. శ్రీదేవి-వర్మ లింక్ గురించి ఒక నటి పీలింగ్ ఏమిటి...ఊర్మిళ-వర్మ సంభందం గురించి చెపుతూ తణికెళ్ల భరణి ఏమన్నారు. వర్మ కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయితో క్లోజ్ గా ఎందుకు ఉండేవారు...వంటి అనే విషయాలు ఉంటాయి అని పుస్తకంలో హైలెట్స్ తెలిపారు.

ఈ చిత్రంలో ప్రతీ ఛాప్టర్ కి పెగ్ అనే నామకరణం చేసాను. ఇంటర్వూలలో వర్మ చెప్పే తెలివైన జవాబులు అనుకునేవాళ్లూ ఉన్నారు. తలతిక్క జవాబులు అనుకునేవాళ్లు ఉన్నారు. అలాంటి ప్రశ్న,జవాబులు కొన్ని సంకలనం చేసి వాటికి మంచింగ్ అని టైటిల్ పెట్టాను. ప్రముఖుల వ్యాసాలకి ఐస్ క్యూబ్స్ అని,అలాగే నా ముందు మాటని ఛీర్స్ అని చివరి మాటని,బాటంస్ అప్ అని అన్నాను...అలా ఎందుకు అన్నానో మీకు పుస్తకం విడుదల అయ్యాక తెలుస్తుంది అని ఊరిస్తున్నారు.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ...గతంలో వచ్చిన 'భూత్‌' చిత్రానికి తాజాగా 'భూత్‌ రిటర్న్స్‌' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించారు. హారర్‌ తరహా కథాంశంతో త్రీడీలో ఈ సినిమాను తెరకెక్కించారు. జేడీ చక్రవర్తి, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో నటించారు. అలయన శర్మ, మధుశాలిని కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'బూచి' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన అనువాదన కార్యక్రమాలు మొదలు కానున్నాయి. అయితే తెలుగు 'బూచి' టైటిల్‌తో రిలీజ్ చేయనున్న ఈచిత్రాన్ని మాత్రం అక్టోబర్ 26న విడుదల చేయనున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి కానందునే ఈ చిత్రాన్ని తెలుగులో కాస్త లేటుగా విడుదల చేయబోతున్నారు.

English summary
lyricist Sirasri is writing a book on Ram Gopal Varma, titled Vodka With Varma. And now we hear that the writer has managed to get RGV's ex-wife Ratna, who has never ever spoken to any media, to break her silence and throw more light on the maverick director. "She told me many interesting things about RGV, things others don't know. She has also spoken about the reason for their divorce," says Sirasri, who adds that even RGV's daughter Revathi has given him some interesting insights for the book.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more