»   » రామ్ గోపాల్ వర్మని ఆ అవార్డు వరించింది...

రామ్ గోపాల్ వర్మని ఆ అవార్డు వరించింది...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి తాజాగా గోల్డెన్ కేలా అవార్డుని సొంతం చేసుకున్నారు. అందులో ఆయనకు విచిత్రమైన విభాగంలో పురస్కారం దక్కింది. 'బస్‌కీజియే బహుత్‌ హోగయా' (ఎక్కువైంది.. ఇక ఆపు) అవార్డును ఇచ్చారు.ఇక గోల్డెన్ కేలా అవార్డులు బాలీవుడ్ లో వచ్చిన పేలవమైన చిత్రాలుకు ప్రకటిస్తూంటారు. ఉత్తమ చెత్త చిత్రం, ఉత్తమ చెత్త నటుడు,నటి,దర్శకుడు ఇలా ప్రతీ విభాగంలోనూ అవార్డులు అందిస్తారు. వీటిని గత మూడు సంవత్సరాలుగా ప్రకటిస్తున్నారు.

ఈ సంవత్సరం మూడో గోల్డెన్‌ కేలా అవార్డుల్ని ప్రకటించారు. అందులో పేలవమైన నటుడిగా షారుఖ్‌ ఖాన్‌ (మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌) అవార్డు సొంతం చేసుకున్నారు. 'మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌' సినిమా ఉత్తమ చెత్త చిత్రంగా ప్రధమ స్ధానంలో నిలిచి అవార్డుని సొంతం చేసుకుంది. అలాగే స్వీయనిర్మాణ సంస్థ నుంచి వచ్చిన 'అయేషా' చిత్రంలోని పేలవమైన నటనకుగానూ సోనమ్‌ కపూర్‌ చెత్తనటిగా ఎంపికైంది. అలాగే గుజారిష్ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కి వరస్ట్ డైరక్టర్ అవార్డ్ సాధించారు.

అలాగే గుజారిష్ చిత్రం బ్లాక్ అవార్డు అందుకుంది. ఎందుకంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ బాగా చేసినందుకు అని ప్రకటించారు. అలాగే వరస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డుని హౌస్ ఫుల్ చిత్రానికి గాను అర్జున్ రామ్ పాల్ ని వరించింది. కైట్స్ చిత్రంలో నటనకుగాను కంగనా రౌనత్ కి వరస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ అవార్డు వరించింది.

English summary
Director Ram Gopal Varma was awarded the 'Bas Kijiye Bahut Ho Gaya' Award (Please Stop Its Enough), asking him to stop making films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu