»   » స్టుపిడ్.. అంటూ.. హద్దు మీరిన వర్మ.. హెచ్చరించిన బిగ్ బీ..

స్టుపిడ్.. అంటూ.. హద్దు మీరిన వర్మ.. హెచ్చరించిన బిగ్ బీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌తో ఆయన తీసిన సర్కార్3 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇటీవల బిగ్ బీని రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో వర్మ అడిగిన ప్రశ్నకు అమితాబ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిచ్చి ప్రశ్నలు అడగకు అని అనడం గమనార్హం. అసలు ఈ వ్యవహారంలో ఏమి జరిగిందటే..

బిగ్ బీతో వర్మ ఇంటర్వ్యూ..

బిగ్ బీతో వర్మ ఇంటర్వ్యూ..

మే 12 తేదీన సర్కార్3 సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో అమితాబ్ సుభాష్ నాగ్రే పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్‌ను విభిన్నంగా చేపట్టేందుకు అమితాబ్‌తో వర్మ ఇంటర్వ్యూ ఒకటి ప్లాన్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో అమితాబ్‌ను వర్మ స్వయంగా ఇంటర్వ్యూ చేయడం విశేషం.

చిరాకు పడ్డ బిగ్ బీ..

చిరాకు పడ్డ బిగ్ బీ..

ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బీని ఉద్దేశించి వర్మ మరో అమితాబ్ బచ్చన్ ఉంటాడని మీరు ఎప్పుడైనా అనుకొన్నారా? అని ప్రశ్న అడిగారు. అందుకు జవాబుగా ‘అలా ఎవరు అనుకొంటారు చెప్పండి' అని అమితాబ్ అన్నారు. ఆ తర్వాత .. ఆరు అడుగుల ఎత్తు కంటే తక్కువ ఉన్న వ్యక్తి అమితాబ్ అవుతాడా? అని వర్మ మరో ప్రశ్న అడగడంపై బిగ్ బీ చిరాకు పడ్డారు.

పిచ్చి ప్రశ్నలు అడుగకు..

పిచ్చి ప్రశ్నలు అడుగకు..

వర్మ ప్రశ్నలపై అమితాబ్ అసహనం వ్యక్తం చేస్తూ ‘సారీ రామూ.. నీవు అడుగుతున్న ప్రశ్న చాలా పిచ్చి (స్టుపిడ్) ప్రశ్న అని అన్నారు. ఇలాంటి ప్రశ్నలు వారి మధ్య ఈ ఇంటర్వ్యూలో ఉన్నట్టు కనిపించాయి. ఈ ఇంటర్వ్యూ పూర్తి భాగం కోసం మే 8 తేదీ వరకు ఆగాల్సిందే.

బోర్‌గా ఫీలైన బిగ్ బీ..

బోర్‌గా ఫీలైన బిగ్ బీ..

అమితాబ్ చేసిన ఇంటర్వ్యూ సమయంలో అడిగిన ప్రశ్నలకు అమితాబ్ చాలా బోర్‌గా ఫీలయ్యాడని, అసహనం వ్యక్తం చేసినట్టు జాతీయ మీడియా ఛానెల్లు కథనాలు రాశాయి. ఈ ఇంటర్వ్యూ ముంబైలోని ప్రముఖ సినీ స్టూడియో మహబూబ్ సినీ స్టూడియోలో జరిగింది. బూజు పట్టిన స్టూడియోలో చాలా క్వాలిటీతో ఇంటర్వ్యూ చేసినట్టు ప్రోమోలో స్పష్టమైంది.

 అనేక విషయాలు..

అనేక విషయాలు..

ఈ ఇంటర్వ్యూలో అమితాబ్ తన జీవితంలోని చాలా కీలక విషయాలను కూడా వెల్లడించినట్టు మరో ప్రమోలో కనిపించింది. దాదాపు మూడు ప్రోమోలను విడుదల చేసినట్టు సమాచారం. ఈ ప్రోమోలలో బాలీవుడ్‌కు సంబంధించిన పలు విషయాలు చర్చకు వచ్చినట్టు వారి మాటల్లో అర్థమైంది.

బిగ్ బీని ఇంటర్య్యూ చేసిన...

కాగా ఈ ఇంటర్యూపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో స్పందించాడు. తొలిసారి జర్నలిస్టుగా మారాను. అమితాబ్‌ను ఇంటర్య్యూ చేసిన తొలి సినిమా డైరెక్టర్‌ను నేనే అని ట్వీట్ చేశారు. అలాగే కొన్ని కారణాల వల్ల ఆస్ట్రేలియాలో జరిగి ఐఫాలో సర్కార్ స్క్రీన్ రద్దు అయిందని వర్మ తెలిపారు.

English summary
In a novel promotional stunt for his upcoming film Sarkar 3, Ram Gopal Varma has interviewed the movie’s star Amitabh Bachchan. RGV asked Bachchan, if there will be another Amitabh Bachchan. Big B dismissed it as a “stupid question.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu