»   » లక్ష్మీ ప్రసన్నని వదలని వర్మ

లక్ష్మీ ప్రసన్నని వదలని వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ దొంగలముఠాలో మంచు లక్ష్మీ ప్రసన్న నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుని తీసినంత రోజులు కూడా ఆడకుండా వెళ్లిపోయింది. అయితే ఆమెకు నటిగా లైఫ్ ఇవ్వాలని కంకణం కట్టుకున్న రామ్ గోపాల్ వర్మ మాత్రం ఆమెను వదిలిపెట్టేటట్లు కనపడటం లేదు. ఆమెను ఇప్పుడు బాలీవుడ్ కి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన తాజా చిత్రం డిపార్టమెంట్ తో ఆమెను అక్కడ ఇంట్రడ్యూస్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

డిపార్టమెంట్ లో ఇప్పటికే రానా హీరోగా నటిస్తున్నాడు. అమితాబ్,సంజయ్ దత్ నటిస్తున్న ఈ చిత్రం పోలీస్ డిపార్టమెంట్ నేపధ్యంలో జరుగుతుంది. ఇక లక్ష్మీ మంచు కూడా ఈ న్యూస్ కన్పర్మ్ చేసింది. ఆమె తాజాగా ట్వీట్ చేస్తూ..ఓ బాలీవుడ్ చిత్రానికి సైన్ చేసాను. సూపర్ గా ధ్రిల్ అయ్యాను. వివరాలు త్వరలో చెపుతాను.నా కలలు అతి త్వరలో నిజం కాబోతున్నాయి అంది. అయితే వర్మ ప్రాజెక్టు అని మాత్రం ఆమె రివిల్ చేయలేదు. ఇంతకుముందు కూడా ఆమెకు క్రిష్ 3లో చేయబోతోందని, రాకేష్ రోషన్ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే అలాంటిదేమీ మెటీరియలైజ్ కాలేదు.

English summary
Ram Gopal Varma has recently signed Lakshmi Manchu for one of the key roles for his upcoming Bollywood film Department.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu