For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్ లో తిరుగుతున్న ఎన్టీఆర్ ఆత్మ? బాలయ్యకి ఎందుకు కనిపించటం లేదు??

  |
  ఎన్టీఆర్ ఆత్మ నిజంగా తిరుగుతుందా

  ఎన్టీఆర్ బయోపిక్ ఈ మధ్య కాలం లో ఈ సబ్జెక్ట్ సృష్టించినంత అలజడి, ఇంట్రస్ట్ మరే తాపిక్ కలిగించలేదేమో. ఇన్ని సినిమాల రిలీజ్ లూ, కలెక్షన్లూ, హిట్ లూ. ఫట్ లూ అన్నిటి మధ్య కూడా ఈ సినిమా మీద ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గటం లేదు. అదీ ఏక కాలం లో ఒకే సబ్జెక్ట్ మీద సినిమాలు రావటం కూదా ఇదే మొదటి సారేమో. ఒకదానికి ఎక్కువా ఒక దానికి తక్కువా అనికాదు ఎన్టీఆర్ జీవితం మీద వస్తున్న ఈ మూడు సినిమాలూ దేనికదే ప్రత్యేకం అన్నంత ఆసక్తిని క్రియేట్ చేసుకున్నాయి.

   ఎన్టీఆర్ ఆత్మచెప్పిందీ

  ఎన్టీఆర్ ఆత్మచెప్పిందీ

  ఎన్టీఆర్ జీవితంపై ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు సినిమాలను ప్రకటించేశారు. ఇలా ఎన్టీఆర్ పై సినిమా తీసేందుకు ఎవరి రీజన్స్ వారికి ఉన్నాయి. ఎవరి యాంగిల్ వారికి ఉంది. సరే అక్కడి వరకూ బాగానే ఉందిగానీ మధ్యలో ఎన్టీఆర్ ఆత్మచెప్పిందీ అంటూ మాట్లాడటమే వింతగానూ ఆయన ప్రతిష్టని తగ్గించేదిగానూ ఉంది.

  ఆత్మలున్నాయా లేదా

  ఆత్మలున్నాయా లేదా

  ఆత్మలున్నాయా లేదా అన్న విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు గానీ ఇక్కడ ఈ సినిమ్మా వాళ్ళు చెప్పే సినేమా కథలే కాస్త ఎక్కువయ్యాయి. బాలకృష్ణ తీస్తానని చెప్పిన సినిమా కేవలం రామారావుగారి విజయాలని, ఆయన మామూలు స్టేజ్ ఆర్టిస్ట్ నుంచీ సినీ పరిశ్రమలో, అటు రాజకీయ ప్రస్తానం లోనూ పైకి వచ్చిన విధానాన్నీ సినిమాగా తీస్తానని చెప్పాడు.

   రామ్‌గోపాల్ వర్మ

  రామ్‌గోపాల్ వర్మ

  అయితే ఈ సినిమా అనౌన్స్ అయ్యిందో లేదో లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ.. రామ్‌గోపాల్ వర్మ తానుకూడా అన్నగారి పై సినిమా తీస్తున్నట్లు చెప్పాడు. నిజానికి "పొగడరా నీతండ్రి ఎన్ఈటీఆర్ ని" అంటూ ఈ దుమారానికి తెర తీసిందే వర్మ.

  వర్మ రియాక్షన్

  వర్మ రియాక్షన్

  ఆ సబ్జెక్ట్ ని బాలయ్య, వర్మా కలిసి తీద్దాం అనుకున్నా తర్వాత ఇద్దరిమధ్యా ఆలోచనలు కుదరక పక్కకి వచ్చేసిన బాలయ్య తేజాతో ఆ సినిమాని నిర్మించే ప్రయత్నం లో పడ్డాడు, ఇక ఆవెంటనే వర్మ కూడా తన సినిమా అనౌన్స్ చేసాడు. ఒక్క సారి ఈగో హర్ట్ అయితే వర్మ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలిసిందే కాబట్టి తన సినిమా టైటిల్ తోనే తాను ఏం తీయబోతున్నాడో, ఎవరు తన టార్గెట్ అన్న విషయాన్ని చెప్పాడు.

   రాజకీయ నీడల్లోకి

  రాజకీయ నీడల్లోకి

  అంతే రాజకీయ నీడల్లోకి ఎన్టీఆర్ వెళ్ళిపోయారు. ఆ సినిమాకి ఫైనాన్స్ చేస్తాం అంటూ వైసీపీ నేత రాకేష్ ముందుకు రాగానే. అసలు వ్యవహారం పక్కకి జరిగి లక్ష్మీ పార్వతిని వార్తల్లోకి లాగుతూ మరో సినిమా మొదలయ్యింది, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తానుకూడా లక్ష్మీస్ వీరగ్రంథం పేరుతో ఇంకో సినిమా అన్నగారి మీదనే అని ప్రకటించాడు. ఇదనా పైకి కనిపించిన వ్యవహారం..

   కథ అందిస్తున్నది ఎన్టీఆర్ ఆత్మే

  కథ అందిస్తున్నది ఎన్టీఆర్ ఆత్మే

  అయితే ఈ సినిమాతీయటానికి తనను ప్రేరేపించినది, ఈ మూవీకి కథ అందిస్తున్నది కూడా ఎన్టీఆర్ ఆత్మే అని వర్మ చెప్పాడు. ఎన్టీఆర్ ఆత్మ తనకు కనిపిస్తోందని.. ఆయన కథంతా పూస గుచ్చినట్టు వినిపిస్తోందని.. చెప్పేస్తున్నాడు వర్మ. నాస్తికుడైన వర్మే ఇంతగా చెప్పగా లేనిది తానుమాత్రం చెప్పలేనా అనుకున్నారేమో...

   లక్ష్మీస్ వీరగ్రంధం

  లక్ష్మీస్ వీరగ్రంధం

  లక్ష్మీస్ వీరగ్రంధం తీస్తానని చెప్పిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డికి కూడా ఎన్టీఆర్ ఆత్మ కనిపించేసిందట, నా మీద సినిమా తీయమంటూ అడిగిందట దాంతో నాకూ ఎన్టీఆర్ ఆత్మ కనిపించిందంటూ చెప్పేసాడు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. పాపం సొంత కుమారుదైన బాలకృష్ణకు మాత్రం ఎన్టీఆర్ ఆత్మ కనిపించలేదాఝ నామీద సినిమా తీయమని చెప్పలేదా?

  బాలయ్య కి కనిపించ లేదా

  బాలయ్య కి కనిపించ లేదా

  పాపం సొంత తండ్రి ఆత్మ ఆయనకు కనిపించి కథ చెప్పకపోవటం వల్లే బాలయ్య మాత్రం సొంత తండ్రే అయినా తనకు తెలియని కోణాలు ఉన్నాయేమో అని ఎన్టీఆర్ సన్నిహితులను సంప్రదించి, వారందరితో మాట్లాడి మరీ మరీ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయించుకున్నాడు.

  ఇప్పటికిప్పుడు బతిమాలుకొని

  ఇప్పటికిప్పుడు బతిమాలుకొని

  ఇప్పటివరకూ ఎవరికీ కనిపించని అన్నగారి ఆత్మ.., పోయి పోయి మాఫియా సినిమాలు తీసే వర్మకీ, అసలు సినిమాలనుంచి దూరంగా ఉంటున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిలకే ఎందుకు కనిపించిందీ? అసలు ఇంతకీ ఇప్పటికిప్పుడు బతిమాలుకొని ఆయన కథని సినిమాగా తీయాల్సినంత అవసరం ఉందా?? అన్నదే ఇప్పుడు కలిగే అనుమానం.

  అభిమానుల్ని భాదపెడుతున్నాయట

  అభిమానుల్ని భాదపెడుతున్నాయట

  ప్రతీ రాజకీయ నాయకుడికీ, సినిమా స్టార్ కీ, ఒక సామాన్య మానవుడికీ తన జీవితం లోని రకరకలా కోణాలుంటాయి వాటిని సినిమాగా తీయటం వరకూ సరే ఎవరూ వాళ్ళని తిట్టలేదు కూదా (పార్టీల పరంగానే వ్యతిరేకత వచ్చింది) కానీ ఇలా అన్నగారి ఆత్మ వచ్చిందీ, కథ చెప్పిందీ లాంటి మాటలే ఆయన అభిమానుల్ని భాదపెడుతున్నాయట.

   జనం మొత్తానికీ తెలిసిందే

  జనం మొత్తానికీ తెలిసిందే

  సినిమా తీయండి., ఆయనలోని మైనస్ లూ, ప్లస్ లూ కొత్తగా ఇప్పుడు చెప్పేపనేం లేదు ఎన్టీఆర్ జీవితం జనం మొత్తానికీ తెలిసిందే... అయుఇతే ఇలాంటి ఆత్మలో వ్యాఖ్యలు మాత్రం చేయవద్దనేది.. అన్నగారి అభిమానుల మాట...

  English summary
  NTR fans hurted About the varma and kethireddy Jagadeeshwar reddys words about NTR's athma has came and Narrated his Story..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X