twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాట మార్చి వెనక్కు తగ్గినా వర్మ మళ్ళీ మొదలెట్టాడు.. ముర్మును టార్గెట్ చేస్తూ ట్వీట్..డిలీట్!

    |

    ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వర్మ ఇప్పుడు కేవలం వివాదాస్పద సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాడు. తాజాగా కొండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వర్మ అనూహ్య పరిస్థితుల్లో చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన బీజేపీ నేతల ఆగ్రహానికి గురయ్యారు. అయితే వివాదం పెరగడంతో ఆ విషయం మీద కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేసిన వర్మ మరోసారి ఆమె మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఆ వివరాల్లోకి వెళితే

    కౌరవులు ఎవరు అంటూ

    కౌరవులు ఎవరు అంటూ

    ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి పదవీకాలం కొద్దిరోజుల్లో ముగియ బోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం మీద పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తమ భాగస్వామ్య పక్షాలతో కలిసి ఎన్డీఏ తరఫున ద్రౌపది ముర్ము అనే ఒరిస్సాకు చెందిన ఆదివాసీ మహిళ, ప్రస్తుత ఝార్ఖండ్ గవర్నర్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించారు. ఆమె పేరు ప్రకటించిన తర్వాత రామ్ గోపాల్ వర్మ అనుచితంగా వ్యాఖ్యానిస్తూ ఆమె ద్రౌపది అయితే పాండవులు ఎవరు? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు అంటూ కామెంట్ చేశారు

    తీవ్రస్థాయిలో

    తీవ్రస్థాయిలో

    ఈ విషయం మీద పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంతో తాను వేరే ఉద్దేశంతో అనలేదని తనకు మహాభారతంలో బాగా ఇష్టమైన ద్రౌపది పాత్ర గుర్తు రావడంతోనే పాండవులు, కౌరవులు గురించి కూడా గుర్తు రావడంతో అలా ప్రశ్నించాను తప్ప వేరే ఉద్దేశాలు ఏవీ లేవని పేర్కొన్నాడు వర్మ. అయితే ఈ విషయం మీద బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

    పోలీసులకు ఫిర్యాదు

    పోలీసులకు ఫిర్యాదు

    ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ విషయం మీద ఆదివాసి సంఘాలు సైతం సీరియస్ అవ్వడంతో పాటు పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. అయితే అక్కడితో వర్మ అగుతాడు అనుకుంటే మరోసారి ఆమె మీద వరుస ట్వీట్లు చేస్తూ కామెంట్లు చేశారు. తాజాగా ద్రౌప‌ది ముర్మును పొగుడుతూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

    బీజేపీకి ధన్యవాదాలు

    బీజేపీకి ధన్యవాదాలు

    అత్యంత గౌరవనీయమైన ద్రౌపది గారు ప్రెసిడెంట్‌గా ఉంటే.. పాండవులు, కౌరవులు ఇద్దరూ తమ యుద్ధాన్ని మరచిపోయి.. కలిసి ఆమెను ఆరాధిస్తారన్న వర్మ కొత్త భారతదేశంలో మహాభారతం తిరిగి రాయబడుతుందన్నారు. ఇండియాను చూసి ప్రపంచం గర్విస్తుంద, జై బీజేపీ..' అంటూ వర్మ ట్వీట్ చేశాడు. అలాగే ద్రౌపది జీ ప్రపంచం మొత్తంలో ఎప్పటికీ గొప్ప రాష్ట్రపతి అవుతారనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని అందుకు బీజేపీకి ధన్యవాదాలు తెలుపుతూ మరో ట్వీట్ కూడా చేశాడు.

    పళ్ళను జూమ్ చేసి

    పళ్ళను జూమ్ చేసి

    అయితే రామ్ గోపాల్ వర్మ ద్రౌపది ముర్ము పళ్ళను జూమ్ చేసిన ఫోటో షేర్ చేస్తూ ఆమె గురించి వెటకారంగా కొన్ని కామెంట్లు చేశారు. తరువాత ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ ఆ ట్వీట్ ఉదయానికి డిలీట్ చేసేసారు. ఆమె విషయంలో రాంగోపాల్ వర్మ యూటర్న్ తీసుకున్నారని కొందరంటుంటే యూటర్న్ లాగా కనిపిస్తోంది కానీ ఆయన మాత్రం ఆమెను విమర్శిస్తూనే వెటకారంగా మాట్లాడుతున్నారని మరికొందరు అంటున్నారు.

    English summary
    Ram gopal varma made sensational tweet on draupadi murmu and then later deletes the tweet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X