»   » ‘వంగవీటి’ వర్మ హక్కు, నన్ను తప్పుగా చూపినా నమ్మరు: దేవినేని నెహ్రూ

‘వంగవీటి’ వర్మ హక్కు, నన్ను తప్పుగా చూపినా నమ్మరు: దేవినేని నెహ్రూ

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'వంగవీటి' సినిమా చుట్టూ పలు వివాదాలు ముసుకున్న సంగతి తెలిసిందే. వంగవీటి రంగ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకె్క్కిస్తున్నారు. ఈ సినిమా ఒకప్పుడు విజయవాడలో కమ్మ కాపు వర్గాలు(వంగవీటి, దేవినేని కుటుంబాలు) మధ్య గొడవ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని ముందు నుండీ ఓ ప్రచారం ఉంది. దీనికి తోడు సినిమాలో కమ్మ కాపు అంటూ ఓ పాట ఉండటంతో మీడియాలో ఈ మూవీ హాట్ టాపిక్ అయింది.

  సినిమాలో కొన్ని అంశాలను వక్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ వంగవీటి రంగ కుమారుడు రాధాకృష్ణ ఇటీవల కోర్టును ఆశ్రయించారు. మరో వైపు రాధా రంగ మిత్ర మండలి కూడా ఈ సినిమా విషయమై వర్మకు వార్నింగ్ ఇచ్చారు.


  ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ శనివారం విజయవాలో వంగవీటి రంగ భార్య రత్నకుమారి, కుమారుడు రాధకృష్ణలతో బేటీకావడం.... దేవినేని నెహ్రూతో బేటీ కావడం చర్చనీయాంశం అయింది. భేటీ కావడానికి ముందు వంగవీటి సినిమా నుండి కమ్మ కాపు సాంగ్ తీసేస్తున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.


  వర్మ తో భేటీ అనంతరం దేవినేని నెహ్రూ ఏమన్నారంటే

  వర్మ తో భేటీ అనంతరం దేవినేని నెహ్రూ ఏమన్నారంటే

  శనివారం మ‌ధ్యాహ్నం వర్మతో భేటీ అనంత‌రం వంగ‌వీటి సినిమా గురించి దేవినేని నెహ్రూ మాట్లాడుతూ వర్మ తనను గతంలో ఈ సినిమా విషయమై కలిసాడని, డైరెక్ట‌ర్ల‌కి ఏ క‌థ‌నైనా సినిమాగా తీసుకునే స‌ర్వ‌హ‌క్కులు ఉన్నాయ‌ని ఆ రోజే చెప్పానని అన్నారు. రు.


  పాట వద్దని చెప్పా

  పాట వద్దని చెప్పా

  వంగవీటి సినిమాలో కమ్మ కాపు పాట‌ను బ్యాన్ చేయ‌డం మంచిద‌ని గ‌తంలో రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌ను క‌లిసిన‌ప్పుడు చెప్పాన‌ని ఈ సందర్భంగా దేవినేని నెహ్రూ గుర్తు చేసుకున్నారు.


  పాత కక్షలు పెంచుకునే పరిస్థితి లేదు

  పాత కక్షలు పెంచుకునే పరిస్థితి లేదు

  నిజజీవిత సంఘటనల ఆధారంగా తీసిన సినిమాలను చూసి పాతక‌క్ష‌ల‌ను గుర్తుకు తెచ్చుకొని త‌న్నుకు చచ్చే ప‌రిస్థితి ఇపుడు లేదని, ఇప్పుడంతా చాలా బిజీబిజీగా బ‌తుకుతున్నార‌ని, అటువంటి ప్ర‌జ‌లు సినిమాల్లో చూపించే వాటిని ప‌ట్టించుకోరని దేవినేని నెహ్రూ అన్నారు.


  వంగవీటి సినిమా చూపిచలేదు

  వంగవీటి సినిమా చూపిచలేదు

  వర్మ తనకు వంగవీటి సినిమా చూపించలేదని, సినిమా ట్రైల‌ర్స్ మాత్రం పెన్‌డ్రైవ్‌లో పెట్టి చూపించాడని దేవినేని నెహ్రూ తెలిపారు. సినిమాలో అసలు ఏం చూపించాడనే విషయం తనకు తెలియదని, నా పాత్రలో ఎవరు చేసారు? మురళి పాత్రలో ఎవరు చేసారు? అనే చిన్న వీడియో క్లిప్స్ మాత్రమే చూపించాడని నేహ్రూ తెలిపారు. ఆ వీడియో చూశాక‌ ఆ వ‌య‌సులో తాను అలాగే ఉన్నానులే అని పీలైనట్లు తెలిపారు.


  నా గురించి అందరికీ తెలుసు

  నా గురించి అందరికీ తెలుసు

  స‌మాజంలోని వ్య‌క్తులు ఎలాంటి వారో ప్ర‌జ‌ల‌కి తెలుసని, సినిమాల్లో మరోలా చూపించిన మాత్రాన ఎవరూ నమ్మరని. సినిమాలో త‌న‌ను వేరే విధంగా చూపించినా తాను ఎటువంటి వాడినో ప్ర‌జ‌ల‌కి తెలుసని, త‌న‌ను సిగ‌రేట్ తాగే వాడిలా చూపించారని, తన తాత‌ల కాలం నుంచి కూడ సిగ‌రేట్ తాగే అలవాటు త‌మకు లేదని, కనీసం టీ, కాఫీలు కూడా తాగమని, వక్కపొడి కూడా నోట్లో వేసుకోమని నెహ్రూ తెలిపారు.


  వర్మ ఏమన్నారంటే

  వర్మ ఏమన్నారంటే

  వంగవీటి సినిమాపై ప్రస్తుతం వివాదాలు కమ్ముకున్నప్పటికీ, తాను తీసిన సినిమాలో మార్పులు చేయనని వర్మ స్పష్టం చేసారు. సినిమా తీసుకునే హ‌క్కు త‌న‌కు ఉందని, నా పని నేను చేసుకుపోయానన్నారు. వంగ‌వీటి రాధాకృష్ణ, ర‌త్నకుమారిల నుంచి ఎటువంటి అభ్యంతరాలు వచ్చాయనే విషయం తర్వాత చెబుతానన్నారు.


  సినిమా తీసా అంతే

  ఎవరినీ టార్గెట్ చేయలేదు


  English summary
  Controversial filmmaker Ram Gopal Varma on Saturday met members of the Vangaveeti and Diveneni families here but refused to compromise on his upcoming Telugu movie "Vangaveeti" -- based on a feud between two clans from two different castes. After meeting Vangaveeti Ratnakmari and her son Vangaveeti Radha Krishna, Varma drove to the residence of their ‘rival’ Deveneni "Nehru" Rajasekhar's to call on him to discuss the row.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more