జైల్లో సూరిని కలిసిన రామ్ గోపాల్ వర్మ

ఇక ఈ సమావేశం అనంతరం పరిటాల రవి భార్య సునీతని ఆమె గ్రామంలోనే కలవనున్నారని తెలుస్తోంది. రాము ఆ ఏరియాలో పూర్తిగా ఓ టూర్ క్రింద తిరిగి రీసెర్చి చేసి సబ్జెక్టు రూపొందించటానికి సన్నాహాలు చేయబోతున్నారని అంతర్గతవర్గాల సమాచారం. అలాగే రక్త చరిత్ర సినిమాను ధర్మ,రక్ష అనే కవల సోదరులు డైరక్ట్ చేయబోతున్నారు. సత్య,కంపెనీ తరహాలో ఈ చిత్రాన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తీయాలని వర్మ భావిస్తున్నారు. ఇక పరిటాల హత్య కేసులో ప్రాధమిక నిందితుడుగా ఉన్న సూరి చాలా కాలంగా బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











