»   » లగడపాటితో రామ్ గోపాల్ వర్మ నా ఇష్టం: త్వరలో నా ఇష్టానికీ సీక్వెల్

లగడపాటితో రామ్ గోపాల్ వర్మ నా ఇష్టం: త్వరలో నా ఇష్టానికీ సీక్వెల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నా చిత్రాలు నా ఇష్టం, చూస్తే చూడండి లేదంటే ఊరుకోండి అనే రామ్ గోపాల్ వర్మ మరో సెన్షేషనల్ సృష్టించనున్నాడు. ఇప్పటి వరకు చిత్రాలకే పరిమితమైన రాం నా ఇష్టం అనే పేరుతో ఓ పస్తకాన్ని రాశాడు. దానిని ఈ నెల చివర్లో విడుదల చేయనున్నాడు. అయితే ఈ పుస్తకాన్ని తన కళాశాల మిత్రుడు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేతులమీదుగా విడుదల చేస్తున్నాడు. తన అభిమాన నటి శ్రీదేవితో కాకుండా లగడపాటితో పుస్తకాన్ని ఆవిష్కరించటం గమనార్హం.

రాం తాను తీసే చిత్రాలద్వారా ఓ పిచ్చివాడిగా, ఓ వెర్రివాడిగా, అహంకారిగా కనిపిస్తాడు. అయితే తనను విమర్శించే వారికి నా ఇష్టం పుస్తకం ఓ సమాధానం అని ఆయన చెబుతున్నాడు. నా ఇష్టం పుస్తకంలో రాం వ్యక్తిత్వం, ఆయన చిత్ర విశేషాలు తదితరాలు ఉంటాయి. మరో విశేషమేమంటే నా ఇష్టం రచనకు కూడా రాం సీక్వెల్ వస్తుందని చెప్పటం. ఈ నెలాఖరున నా ఇష్టం మొదటి భాగం విడుదల చేస్తుండగా, త్వరలో దాని సీక్వెల్ ను విడుదల చేస్తానని చెబుతున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu