For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పవన్‌ను ఆయన తప్పుదారి పట్టిస్తున్నాడు (వర్మ ఓపెన్ లెటర్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన 'ఇజం' పుస్తకంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తన అసంతృప్తి వెల్లగక్కిన సంగతి తెలిసిందే. ఆ పుస్తకం తనను ఎందుకు సంతృప్తి పరచలేదో వెల్లడిస్తూ రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాసారు. అందుకు సంబంధించిన లేఖ పూర్తి పాఠం ఇదే...

  హే పవన్..
  'ఇజం' పుస్తకం గురించి మాట్లాడే ముందు మొదటగా నేను పశ్చాత్తాప పడాలి. నువ్వు రాజకీయపార్టీ పెడతావన్నప్పట్నుంచీ నేను ఆసక్తిగా ఎదురు చూసాను. నీలోని మంచి గుణాలను పొగిడాను. జనసేన పార్టీ ఆవిర్భావం సమయంలో నీ స్పీచ్ నాకు బాగా నచ్చింది. ఇజం పుస్తకం గురించి విని సంతోష పడ్డా. ఎందుకంటే పుస్తకాలు చదవడం అంటే నాకు ఇష్టం . ఇమ్మానుయేల్ కాంట్, ఆర్థర్ స్కాపెన్ హర్, డెస్కరేట్స్, విల్హె ల్మ్ హెగెల్, ఫెడ్రిక్ నిట్జాస్కె, బారక్ స్పినోజా, అయాన్ ర్యాండ్ వంటి వారి రచనలను విద్యార్థి దశలోనే చదివాను. ఆధునిక తత్వవేత్తల పుస్తకాలను కూడా చదివాను. తత్త్వశాస్త్రం సమాజంలోకి తీసుకెళ్లడం ద్వారా మార్పు తేవచ్చని బోధించిన వారే వీరంతా. ఈ పాత కాలపు తత్వవేత్తల ఆలోచనకు భిన్నంగా పురోగతి కలిగిన విధానం నీ ఇజం లో ఉంటుందని నేను భావించాను. కానీ నీ ఇజం పుస్తకం నేను ఊహించింది ఏమీ లేదు.

  ఇజం పుస్తకంలో రాజు రవితేజ్ చెప్పిన విషయాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్...నేనిక్కడ రాజు రవితేజ్ గురించే చెబుతున్నాననే విషయం గుర్తుంచుకో! ఎందుకంటే ఈ ఇజం పుస్తకం రచయితగా అతని పేరునే నువ్వు ఇచ్చావు గనుక. ఇజం పుస్తకంపై నా అభిప్రాయాల్ని ప్రజా వేదికలో పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే నేను ప్రతిక్షణం నీ గురించి నా అభిప్రాయాల్ని అటువంటి ప్రజా వేదికల ద్వారానే చేరవేస్తాను.

  Ram Gopal Varma open letter to Pawan kalyan

  జన సేన పార్టీ ఆవిర్భావ సమయంలో నీ యొక్క ప్రవర్తన ద్వారా నేను గమనించిన విషయం ఏమిటంటే.. నీకు సహజాతంగా వచ్చిన జ్ఞానమే ఎక్కువ. ఇజం లాంటి ఉధ్గ్రంథాన్ని నాజీవితంలో నేనెప్పుడూ చదవలేదు. క్షమించు పవన్. రాజు రవి తేజ్ తో చెప్పించిన పాత చింతకాయ తత్త్వసిద్ధాంతాలు నీకు నిజంగా అవసరం లేదు. ఆర్థర్ స్కాపెన్ హార్స్ పుస్తకం 'ద వరల్డ్ యాజ్ విల్ అండ్ ఐడియా'ను గానీ, ఇమ్మానుయేల్ కాంట్ పుస్తకం 'ద క్రిటిక్ ఆఫ్ రీజన్' గానీ ఒకసారి చదువు. తీరికలేని పనిఒత్తిడితో నీకు ఖాళీ దొరకదని నేను నమ్ముతున్నాను. ఆ విషయం నాకు తెలుసు. రాజు రవి తేజ ఈ పుస్తకాల్ని చదివి తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఈ పిల్లాడు నీ సహజాతమైన మేథో సంపత్తిని పాడు చేస్తున్నాడు. స్కాపెన్ హార్ ఆధిభౌతిక తత్త్వానికి, కాంట్ వేదాంతానికి, మార్క్స్ గతి తార్కిక భౌతిక వాదానికి రాజు రవితేజ్ వక్ర భాష్యం చెబుతున్నాడు. ఈ కుర్రాడు మిమ్మల్ని పూర్తి గా తప్పుదారి పట్టిస్తున్నాడు. నీ అసలుసిసలు ఆలోచనా విధానాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. అస్తిత్వ నిహిలిజాన్ని రాజు రవి తేజ్ తప్పుగా అర్థం చేసుకున్నాడు.

  గతంలో వచ్చిన త్వత్తసిద్ధాంతాలు, ఆధునిక సమాజాల ఏర్పాటును మీరు కచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆ ఆధునిక సమాజానికి వందశాతం నిష్కల్మషమైన పవనిజం కావాలి. అంతేగానీ అకస్మాత్తుగా ఏదో తోచింది చేసినట్లు , తప్పుడు రాతలు, వక్రభాష్యాలు, స్వయంగా కాకుండా రెండో వ్యక్తి ద్వారా తెలుసుకునే సూడో తత్త్వాలు కాదు కావాల్సింది. 90 శాతం వరకూ నీ ఇజం పుస్తకం ఒక దిశానిర్దేశం లేకుండా సాగింది.

  మార్షల్ ఆర్ట్స్ చేసే ఫైటర్ బ్రూస్ లీ కూడా మంచి తత్వవేత్త. 'జ్ఞానమనేది నిచ్చెనకున్న మెట్లలాగా ఎక్కేందుకు మనకు ఉపయోగపడాలి. ఒకసారి ఎక్కిన తర్వాత ఒక్కో మెట్టును నీ వెనుక వదిలేయాలి. కానీ, నీవు ఆ మెట్లను సేకరించుకుంటూ పోతే చివరకు నీవెక్కిన నిచ్చెన బరువెక్కి ఏదో ఒకరోజు పడిపోవచ్చు. కాబట్టి నువ్వు మోయాలనుకుంటున్న బరువుని ఎప్పుడూ కూడా మోసుకెళ్లకు' అని ఒకచోట బ్రూస్ లీ అంటాడు.

  పవన్, నేనిక్కడ బ్రూస్ లీ ని పేర్కోవడానికి కారణం అతని ఉద్వేగాన్ని, చొరవచూపించే సచ్ఛీలత నీకు పంచాలనుకుంటున్నాను. బ్రూస్ లీ శైలి లో ఉన్న గొప్పతనం ఇతరుల చేత ప్రభావితమవడాన్ని అతను నిరాకరించడం. నీగురించి నీవు ఏమనుకుంటున్నావో, నీ తత్త్వాన్ని నీకు నీవుగా ఎలా వ్యక్తపరచాలో అర్థంచేసుకుంటావని ఆశిస్తున్నాను. నీమీద ఉన్న ఇతరత్రా దుష్ప్రభావాలను వదిలించుకుంటావని నీ శ్రేయోభిలాషిగా వేడుకుంటున్నాను. చివరిగా నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. నీ ఇజం గ్రంథంతో పూర్తిగా నిరాశ చెందాను. కానీ, పవనిజం మీద మాత్రం ఇప్పటికీ అమితమైన అంచంచల విశ్వాసంతో ఉన్నాను.

  English summary
  Ram Gopal Varam is not at all satisfied with Pawan kalyan "ISM" book and he wrote an open letter to Pawan kalyan. TOI released this exclusive letter. Here is what he said to Pawan kalyan.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more