జియాఖాన్ పై రామ్ గోపాల్ వర్మ షార్ట్ ఫిల్మ్

By Srikanya

హైదరాబాద్ : ప్రముఖ దర్శక,నిర్మాత రామ్ గోపాల్ వర్మ...తనదైన శైలిలో జియాకి నివాళులర్పించారు. జియాపై రెండు నిమిషాల నిడివి ఉన్న ఓ లఘు చిత్రాన్ని రూపొందించారాయన. 'ది రీల్‌ అండ్‌ ది రియాల్టీ ఆఫ్‌ జియా' అనే పేరుతో దీన్ని సిద్ధం చేశారు.

'నిశ్శబ్ద్‌' సినిమాతో జియాను బాలీవుడ్‌కి పరిచయం చేసింది వర్మనే. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ 'తెర మీద ఆమె కనిపించిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకొంది. అప్పటికప్పుడు తనను తాను మలుచుకొని పాత్రకు న్యాయం చేసింది' అని చెప్పుకొచ్చారు.

వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయనది నిర్లిప్త స్వభావమని చిత్రసీమలో చెబుతారు. ఆయనలో భావోద్వేగాలు ఉండవనుకుంటారు. అయితే హిందీ హీరోయిన్ జియాఖాన్‌ ఆత్మహత్యను వర్మ జీర్ణించుకోలేకపోతున్నారు.

తన దృష్టిలో ఆమె ఇంకా బతికే ఉందంటున్నారు. ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయిందంటే నమ్మలేకపోతున్నానని వర్మ చెబుతున్నారు. జియా అంత్యక్రియలకుగానీ, ఆ తరవాత కుటుంబ సభ్యులు నిర్వహించిన సంస్మరణ కార్యక్రమానికిగానీ ఆయన హాజరు కాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X