»   » నాకో అమ్మాయి మెసేజ్ చేసింది, రానా గురించే: రామ్‌గొపాల్ వర్మ

నాకో అమ్మాయి మెసేజ్ చేసింది, రానా గురించే: రామ్‌గొపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

కథానాయకుడు దగ్గుబాటి రానాపై.. దర్శకుడు రామ్‌గొపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రానా కథానాయకుడిగా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం గత శుక్రవారం విడుదలై విశేషణ ఆదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. రానా కథానాయకుడిగా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ఈ నెల 11న విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

ఈ సినిమాలో రానా నటనను మెచ్చుకుంటూ సోషల్‌మీడియాలో వర్మ పోస్టులు పెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానా గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని, మిగితా రెండు సినిమాల కథానాయకుల పేర్లను కూడా మర్చిపోయారని వర్మ చెప్పారు.

 Ram Gopal Varma Praises Rana

బాహుబలిలో రానా దేహదారుఢ్యం గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో ఆయన నటన గురించి ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని, ఓ గ్రీక్ దేవుడి అందం- అద్భుతమైన నటనకు మించిన కాంబినేషన్ ఏముంటుందని వర్మ అన్నారు. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో రానా అద్భుతంగా ఉన్నాడని తనకు ఓ అమ్మాయి మెసేజ్ చేసిందని వర్మ పేర్కొన్నారు.

English summary
Ram Gopal Varma Praises Rana for Nene Raju Nene Mantri Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu