»   » రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర-2' విడుదల వాయిదా

రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర-2' విడుదల వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ రూపొందించిన "రక్త చరిత్ర-2" చిత్రం మొదట ప్రకటించినట్లుగా నవంబర్ 19న విడుదలకాకపోవచ్చునని సమాచారం. ఈ చిత్రం మొదటి పార్ట్ కలెక్షన్స్ బాగుండంటంతో విడుదలను వాయిదా వేసే అవకాశముందని తెలుస్తోంది. విశ్వననీయంగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం నవంబర్ 26న విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే డిస్ట్రిబ్యూటర్స్ తో ఒక మాట అనుకుని పైనల్ నిర్ణయం తీసుకుని, పోస్టర్స్ వేద్దామని ఆలోచిస్తున్నట్లు వినపడుతోంది. అందులోనూ హిందీలో నవంబర్ 19కి హృతిక్ రోషన్ నటించిన గుజారిష్ విడుదల ఉండటంతో కూడా ఆ పోటిని తట్టుకోవటం కష్టమవుతుందని భావిస్తున్నారు. ఇక రక్త చరిత్ర ఆంధ్రాలో కలెక్షన్స్ బాగున్నాయి. హిట్ టాక్ వచ్చింది. నార్త్ లో బిలో యావరేజ్, కొన్ని ఏరియాల్లో యావరేజ్ టాక్ నడుస్తోంది. ఇక రక్త చరిత్ర పార్ట్ 2 మొత్తం తమిళ హీరో సూర్యని హైలెట్ చేస్తూ నడవనుంది. మద్దెల చెరువు సూరిగా సూర్య చేస్తూంటే అతని భార్య భానుమతిగా ప్రియమణి కనిపించనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu