»   » రామ్‌ గోపాల్‌ వర్మ 'రక్త చరిత్ర 2' సెన్సార్ కట్స్ ఏమిటంటే...

రామ్‌ గోపాల్‌ వర్మ 'రక్త చరిత్ర 2' సెన్సార్ కట్స్ ఏమిటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో సినెర్జి ప్రొడక్షన్స్‌ నిర్మించిన 'రక్త చరిత్ర-2'లో సూర్య వివేక్‌, ఒబెరాయ్‌, శతృఘ్న సిన్హా, ప్రియమణి, రాధిక ఆప్టె, కోట ముఖ్య పాత్రధారులు మధు మంతెన, శీతల్‌ వినోద్‌ తల్వార్‌, చిన్న వాసుదేవరెడ్డి, రాజకుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని 5 గురు సభ్యులతో కూడిన 'ఇసి' చూసి 6 కట్స్ ‌తో 57 అడుగుల ఫిలిం కత్తెరించి 30-11-10న 'ఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.

1. జీవించి వున్న లేదా మరణించిన ఏ వ్యక్తి యొక్క కేరక్టర్‌తోగాని, కథతో గాని పోలిక లేదు అనేది మొదటరీలులో చూపించమన్నారు.
2. 'ధూమపానం ఆరోగ్యానికి హానికరం' అనే చట్టబద్ధమైన హెచ్చరికను చూపించమన్నారు.
3. మొదటి రీలులో చిత్రీకరించిన పాటలోని 'రాజకీయ మహాభారతం' అనే పదాలు తొలగించి శబ్దం వినబడ కూడదన్నారు.
4. మొదటి రీలులోని పాటలో వున్న 'పీకేస్తాను' పదం తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
5. అయిదు ఆరు రీళ్ళలో కోర్టు హాలులో చిత్రీకరించిన షూటింగ్‌కి సంబంధించిన దృశ్యాన్ని తగ్గించమని, జడ్జిని చూపే దృశ్యాన్ని తొలగించమని సూచించడం ద్వారా 19.08 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.
6. పదిహేను పదహారు రీళ్లలో చిత్రీకరించిన సన్నివేశాల్లో ప్రతాప్‌ కాయంపై రక్తం మరకలు 30 శాతం, నందిని ప్రతాప్‌ రక్తపు మరకలు తుడిచే దృశ్యాల్లో 30 శాతం తగ్గించమనడం ద్వారా 37.08 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.

16 రీళ్ల నిడివి గల రక్త చరిత్ర-2-3-12-10న విడుదలయింది. ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu