»   » 'రక్త చరిత్ర' ఆడియో, సినిమా రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్

'రక్త చరిత్ర' ఆడియో, సినిమా రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రక్త చరిత్ర చిత్రం విడుదల తేదీని అక్టోబర్ 22గా నిర్ణయించారు. అలాగే ఆడియో రిలీజ్ ని సెప్టెంబర్ 26(ఆదివారం) విడుదల చేయనున్నారు. మధుర మ్యూజిక్ ద్వారా ఈ పాటలు విడుదల అవుతాయి. అలాగే ఈ చిత్రం కోసం తొలిసారిగా రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఓ పాట పాడారు. కత్తులతో సావాశం...నెత్తురుతో సమాప్తం అంటూ బ్యూక్ గ్రౌండ్ లో ఈ పాట వస్తుంది. ఇక ఈ చిత్రం గురించి రామ్ గోపాల్ వర్మ...యథార్థ వ్యక్తుల యథార్థ సంఘటనలతో ప్రభావితమైన ఒక కల్పిత గాధగా రక్త చరిత్ర చిత్రాన్ని రూపొందించినట్లు చెప్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలో సినిమా చేయాలనుకున్నప్ప ట్నుంచీ రాయలసీమకు సంబంధించిన ఎందరో వ్యక్తుల్ని కలిశానని, రెండు వర్గాలుగా చలామణీ అవుతున్న వారి వద్ద నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని అన్నారు.

వారు చెప్పేది వారి వైపునుంచి ఆలోచిస్తే కరెక్ట్‌గా ఉంటుంది. ఇవతలివైపు నుంచి ఆలోచిస్తే తప్పు అనిపిస్తుంది. ఈ కథనాల్లో కథకు ఉపకరించే విషయాలను మాత్రమే తీసుకొని 'రక్త చరిత్ర'ను తయారు చేశాను. ఇప్పటి వరకూ నేను ఏ కథలో వినని, కనని భావోద్వేగాలు ఇందులో ఉన్నాయి. అందుకే దీన్ని ప్రేక్షకులకు అందించాలని ఈ సినిమా చేస్తున్నాను. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రతి సన్నివేశం రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇలానే జరిగి ఉంటుందేమో....అనిపించే విధంగా సన్నివేశాలు ఉంటాయి అని చెప్పుకొచ్చారు. ఇక 'రక్త సిక్త వర్ణమైన...తరతరాల చరిత్ర' అనే పల్లవితో సాగే టైటిల్‌ సాంగ్‌ ఇప్పటికే ప్రోమోల ద్వారా పాపులర్ అయ్యింది. పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో వివేక్ ఒబరాయ్..రవి పాత్రను, మద్దెల చెరువు సూరి పాత్రను తమిళ నటుడు సూర్య పోషిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu