»   » రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' ప్రివ్యూ

రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' ప్రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆనందపురంలో కథ జరుగుతూంటుంది. వీరభధ్రయ్య (రాజేంద్ర గుప్త)ని చంపేయటంతో ఆయన కొడుకు శంకర్ రవి(సుశంత్) అడవుల్లోకి వెళ్ళిపోయి పగ తీర్చుకునే క్రమంలో హత్యలు చేస్తూంటాడు. అయితే వీరభద్రయ్య చిన్న కొడుకు ప్రతాప్ రవి (వివేక్) వీటికి దూరంగా ఉంటూంటాడు. అయితే కొద్ది రోజులకు శంకర్ రవి కూడా చంపబడతాడు. దాంతో ఎదుటివాళ్లతో మాట్లాడటానికి కూడా సిగ్గుపడే ప్రతాప్ రవి జీవితం తనకు తెలియకుండానే వర్గ పోరాటంలో దిగాల్సిన పరిస్ధితి వస్తుంది. తన అన్నని, తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకునే క్రమంలో కొంతమందిని చంపేస్తాడు. అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తుల కుటుంబంలోంచి బుక్కా రెడ్డి(అభిమన్యు సింగ్) వస్తాడు. అతను ప్రతాప్ రవికి ప్రధాన శత్రువుగా మారతాడు. ఈ క్రంమంలో ఫ్యాక్షన్ లీడర్ గా ఎదిగిన ప్రతాప్ రెడ్డి...శివాజీరావు(శతృఘ్నసింహా) కళ్ళల్లో పడతాడు. కొత్తగా పార్టీ పెట్టిన శివాజీరావు..బుక్కారెడ్డికి చరమగీతం పాడి ప్రతాప్ ని తన పార్టీలోకి ఆహ్వానిస్తాడు. ఆ తర్వతా ఏం జరుగుతంది. ప్రతాప్‌ రెడ్డి, ఆయన ప్రత్యర్థుల జీవితాలు చివరకి ఏ దశకు చేరుకొన్నాయన్నదే 'రక్త చరిత్ర'.

ఇక ఈ చిత్రం గురించి వర్మ...నాకు తెలిసిన నిజంతో తెరకెక్కించిన కల్పిత కథ ఈ చిత్రం. ఇప్పటి వరకు నేను రూపొందించిన చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. మనిషిలో కలుషితం కాని భావోద్వేగం ఏదైనా ఉందంటే అది ఒక్క ప్రతీకారం మాత్రమే. అదే ఈ సినిమాను నడిపిస్తుంది. ఇందులో హీరోలు, విలన్లు అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరని చెప్తున్నారు. ఇది పరిటాల రవి జీవితం ప్రేరణతో తీసిన సినిమాయే కానీ, వంద శాతం ఆయన జీవిత కథ కాదు. ఈ సినిమాలో పాటలు లేవు, కామెడీ లేదు, భారీ సెట్స్ లేవు, ఫ్యామిలీ ఎలిమెంట్స్ లేవు. కానీ మానవ భావోద్వేగాలున్నాయి. ఆ భావోద్వేగాలతో మనిషి ఏం చేస్తాడనే వాస్తవిక కోణం ఉంది అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. అలాగే ఇదివరకటి నా 'కంపెనీ'లో బిజినెస్, ఇంటలిజెన్స్ కూడిన వయొలెన్స్ వుంటే, 'రక్త చరిత్ర'లో భౌతికమైన హింస ఎక్కువగా కనిపిస్తుంది అన్నారు.

వివేక్ ఓబరాయ్, సూర్య, శత్రుఘ్న సిన్హా ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం రూపొందింది. సినర్జీ ప్రొడక్షన్ పతాకంపై మధు మంతెన, శీతల్ వినోద్ తల్వార్, చిన్నా వాసుదేవరెడ్డి, రాజ్‌ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి సి. కల్యాణ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రం ఈ రోజు(శుక్రవారం) అంతటా విడుదల అవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu