రామూ ఏది చేసినా సంచలనమే-అలాగే రక్త చరిత్ర పార్ట్ 2

ఈ చిత్రాన్ని తెలుగు లో నిర్మిస్తున్న నిర్మాత సి.కళ్యాన్ మాట్లాడుతూ 'ఈ చిత్రం మొదటి భాగాన్ని అక్టోబర్ 21 న తెలుగులో అత్యంత గ్రాండ్ గా విడుదల చేస్తున్నాము. రాము గారు ఏది చేసినా అది సంచలనమే. శివతో చైన్ తెంపించినా ఇప్పుడు పంపు కింద కత్తి కడుగుతున్నా సంచలనమే. ఈ చిత్రం ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ తో పాటు ఈ చిత్రం యూనిట్ అంతా అనంతపురంలో మొదటి రోజు ప్రేక్షకుల మధ్యలో ఈ చిత్రాన్ని చూస్తున్నారు. ఎవ్వరినీ భాద పెట్టేవిధంగా కాకుండా అందరిని ఆలోచింప చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ ని రాము గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందించారు. తప్పక అందరిని ఆకట్టుకుని బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని అన్నారు.
ఇప్పటికే క్రేజీ ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు లో ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్ సమర్పిస్తుండగా మధు మంతెన, వాసుదేవరెడ్డి, రాజ్ కుమార్ నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో ఇటివలే విడుదలైంది. రామ్ గోపాల్ వర్మ స్వయంగా పాడిన కత్తులతో సావాసం అనే పాట ఆడియో కి హైలైట్ గా నిలవటమే కాక అందరిని ఆలోచింపచేసేవిధంగా వుంది. కాగా రక్తచరిత్ర పార్ట్-2 ని మాత్రం నవంబర్ లో విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











