Don't Miss!
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- News
ప్రధాని మోడీ వైస్రాయ్ అవుతారా? లేక గవర్నర్లను ఎత్తేస్తారా?: కేటీఆర్ విమర్శల దాడి
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
RGV: అషురెడ్డి కాలిపై ముద్దు గురించి ఆర్జీవీ క్లారిటీ.. మా ఇద్దరి సంబంధం అంటూ షాకింగ్ గా!
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన స్టైల్ లో ట్వీట్స్, కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీకే కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. కామెంట్స్, ట్వీట్స్ మాత్రమే కాకుండా వివాదస్పదైమైన చిత్రాలు తెరకెక్కించడం, వీడియోలు చేయడంలో ఆయన దిట్ట. ఇక ఇటీవల డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ బ్యూటి అషు రెడ్డి పాదాలపై ఆర్జీవీ ఘాటుగా ముద్దు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చర్యపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై తాజాగా ఓ వీడియో రూపంలో స్పందించాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.

హాట్ బ్యూటీలు ప్రధాన పాత్రలుగా..
రామ్ గోపాల్ వర్మ.. ట్వీట్ గానీ, కామెంట్ గానీ, సినిమా గానీ.. ఏదైతే ఏంటీ.. దానితో ఏదో ఒక వివాదం వస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఆయన ట్వీట్స్, కామెంట్స్ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. సినిమాలను కూడా తనకు నచ్చినట్లుగా తెరకెక్కిస్తారు. అలా ఆయన ఇష్టంగా తెరకెక్కించిన మూవీ డేంజరస్. హాట్ బ్యూటీలు అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలైంది.

విమర్శలతో ట్రోలింగ్..
డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితో ఓ ఇంటర్వ్యూ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఈ ఇంటర్వ్యూ చివరిలో అషు రెడ్డి పాదాలకు చాలా ఘాటుగా ముద్దు పెట్టాడు ఆర్జీవీ. అంతేకాకుండా ఆమె కాలి బొటన వేలిని చీకారు కూడా. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ వీడియో చూసిన కొంతమంది ఆర్జీవీపై విమర్శలు సంధిస్తూ విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

నేను దేవుడిని నమ్మను..
ఆయనపై ట్రోల్ చేయడంపై ఓ వీడియో రూపంలో సమాధానం ఇచ్చాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆ వీడియోలో "ఎవరూ మాట్లాడినా, ట్వీట్ చేసినా, మీమ్ చేసినా, ఏదైనా సరే.. బిట్స్ బిట్స్ గా ఇలా చేశాడంటున్నారు. అషు రెడ్డితో ఇంటర్వ్యూలో ఏం చేసినా అది ఒక ఫ్రేమ్ లో పెట్టాలనుకుంటున్నాను. నేను దేవుడిని నమ్మను. కాబట్టి దేవుడు ఏం చెప్పాడనేది నేను పట్టించుకోను. అలాగే మెరాలిటీ, సమాజం వంటి విషయాలు కూడా పట్టించుకోను.

ఒక క్లారిటీ ఉండాలి..
మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడే సందర్భంలో వాళ్లకు ఇబ్బంది లేనప్పుడు ఇంకెవరికో ఇబ్బంది అవుతుందనే విషయంలో ఐ డోంట్ కేర్. నేను ఆ ఇంటర్వ్యూ పెట్టిందే కమ్యూనికేట్ చేయడానికి. ఆ ఇంటర్వ్యూ వెనుకున్న ఇన్టెన్షన్ చెప్పాలనుకుంటున్నాను. నేను ఎవరి కోసం ఈ పని చేయడం లేదు. మనిషి పుట్టి పెరిగిన తర్వాత, బతుకుతున్నప్పటి వరకు ఒక క్లారిటీ ఉండాలి. చట్టపరమైన సమాజంలో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ పాటించాలి. లేకపోతే నేరం అవుతుంది. తగిన శిక్ష పడుతుంది.

ఎవరి ఇష్టం వారిది..
నైతికతలో ఈ పని చేస్తే కరెక్ట్.. ఆ పని చేస్తే తప్పు అనే ఓ అపరాధ భావం ఉంటుంది. ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు, బయట వాళ్లు, మనం పని చేసే చోట ఏమనుకుంటారనే ఫీలింగ్ ఉండేదే సోషల్ యాక్సెప్టెన్స్. ఇందులో వాళ్లు బతకాల్సిన పద్ధతిలో బతకకుండా మనసు చంపుకుని బతుకుతుంటారు. ఎవరి ఇష్టం వారిది. దాన్ని నేను తప్పు బట్టను. ట్విటర్ అనేది వ్యక్తిగత కమ్యూనికేషన్ సిస్టమ్.

మా ఇద్దరి మధ్యనే ఉంటాయి..
నన్ను ఇష్టపడి ఫాలో అయ్యేవాళ్లు, క్యూరియాసిటీతో ఫాలో అయ్యేవాళ్లు ట్విటర్ లో ఉంటారు. నేను మాట్లాడే మాటలు, వీడియోలు నచ్చకపోతే అందులో నుంచి లాగవుట్ అయి వెళ్లిపోవచ్చు. నేను ఎవరినీ పట్టుకోవాలనుకోవట్లేదు. నేను అషు రెడ్డి అడల్ట్స్. తనకు నాకు మధ్య అభ్యంతరం లేకుండా చేసిన చేష్టలు అన్నీ మాకు సంబధించినవి. మా ఇద్దరి మధ్యనే ఉంటాయి. మిగతా వాళ్లు చూడొచ్చు. చూడకపోవచ్చు. ఏమైనా అనుకోవచ్చు.
మీ చావు మీరు చావండి..
మనం జీవితంలో చేసే పనిలో ఓ కష్టం ఉంటుంది. మరొటి ఎంటర్టైన్ మెంట్ కూడా ఉంటుంది. ఎంటర్టైన్ మెంట్ కోసం ఎవరికీ నచ్చిన పనులు వారు చేస్తుంటారు. అలా నేను ఎంచుకున్న ఎంటర్టైన్ మెంట్ లో ఇలా అందమైన అమ్మాయితో మాట్లాడటం. అందులో మా ఇద్దరికే అభ్యంతరం ఉండాలి. మీకు ఇష్టం లేకపోతే చూడటం మానేయండి. మీకు వేరే పనులు లేవా. ఇష్టం లేనప్పుడు ఎందుకు చూడాలి. మీకు నచ్చని విషయాలు వందలు వేలల్లో జరుగుతాయి. వాటన్నింటిని ఆపేస్తారా.. నన్ను వీడొక పర్వర్ట్, మైండ్ దొబ్బింది, క్రాక్ ఇలా ఏమనుకున్నా పర్వాలేదు. నా చావు నేను చస్తా.. మీ చావు మీరు చావండి. అదే నా లైఫ్ ఫిలాసఫీ" అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.