»   » అమ్మ ఇచ్చిన ఙ్ఞాపకం ఇదే... వర్మ, జయలలిత తో తన ఫొటో షేర్ చేసాడు

అమ్మ ఇచ్చిన ఙ్ఞాపకం ఇదే... వర్మ, జయలలిత తో తన ఫొటో షేర్ చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అస్తమించడం యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆమె లేరన్న నిజాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బరువైన మనసుతో ఆమె తుది నివాళి ఘటిస్తున్నారు. ఆమెతో తమకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఇదే సందర్భం లో దర్శకుదు రాం గోపాల్ వర్మ కూడా జయలలిత తో తనకున్న ఒకే ఒక ఙ్ఞాపకాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. అదేమిటంటే వర్మ జయ చేతుల మీదుగా ఒకసారి అవార్డు అందుకున్నాడు.

Ram Gopal Varma receiving Nandi Award from Jayalalitha

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకి.. దివంగత నేత జయలలిత అవార్డు ఇచ్చారు. 1991లో వెంకటేష్‌, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా క్ష‌ణక్ష‌ణం సినిమా తెర‌కెక్కింది. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కేఎల్‌.నారాయ‌ణ నిర్మించిన ఈ సినిమాకు వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాకు గాను వర్మ జయలలిత చేతుల మీదుగా ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. 1992లో నెల్లూరులో జరిగిన నంది అవార్డుల ప్రదానోత్సవానికి అప్పటి ఏపీ సీఎం నేదురుమల్లి జనార్థనరెడ్డితో కలిసి జయలలిత హాజరయ్యారు.

అలా 'క్షణక్షణం' చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడి అవార్డును జయలలిత చేతుల మీదుగా అందుకొన్నారు. తమిళ ప్రజలు ప్రేమగా పిలుచుకునే 'అమ్మ' 75 రోజులు మృత్యువుతో పొరాడి సోమవారం రాత్రి 11.30కు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వర్మ జయలలితను గుర్తుచేసుకుంటూ ఆమె చేతులతో అవార్డు అందుకుంటున్న ఫొటోను ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాడు వర్మ. "జయలిత లేని తమిళనాడు ను ఊహించుకోలేం" అని ట్వీట్ చేశాడు. మామూలుగా ఎవరి మీదైనా ఇంత సాఫ్ట్ గా స్పందించటం అరుదుగా జరిగే విషయమే.

English summary
Ramgopal Varma shared an old pic where he received Nandi Award for Best director in Kshana Kshanam movie released in 1991 from Jayalalitha. He also said that it is only time he went for an Award function to receive Award.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu