twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాత నట్టికుమార్‌పై రాంగోపాల్ వర్మ పరువునష్టం దావా.. ఫోర్జరీ చేాశారంటూ నట్టి ఫ్యామిలీపై కేసు

    |

    ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ డేంజ‌ర‌స్ 'మా ఇష్టం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తనతో కొన్ని సినిమాలు చేసిన అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలలో ఒక లెస్బియన్ స్టోరీ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా మీద నట్టి కుమార్ పిటిషన్ కారణంగా కోర్టు స్టే ఇవ్వగా వర్మ మాత్రం థియేటర్లు ఇవ్వకపోవడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు అసలు నట్టి కుమార్ కు తనకు మధ్య ఇబ్బంది ఏంటి అనే విషయం మీద ఆయన క్లారిటీ ఇస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ వివరాలు

     డబ్బులు ఇవ్వలేదని

    డబ్బులు ఇవ్వలేదని

    డేంజరస్ (మా ఇష్టం)' విడుదలను ఆపాలని సిటీ సివిల్ కోర్టు కొద్దీ రోజుల క్రితం ఆదేశాలను జారీ చేసింది. వర్మ రిలీజ్ చేస్తున్న మా ఇష్టం సినిమా మీద సినీ నిర్మాత నట్టి కుమార్ పిటిషన్ వేశారు. వర్మ తనకు రూ. 5.29 కోట్లు ఇవ్వాలని ప్రతి సినిమాకు రూ. 50 లక్షలు ఇవ్వాలని ఒప్పందం ఉండగా దాన్ని పక్కన పెట్టి సినిమా విడుదల చేస్తామని పిటిషన్లో పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం తనకు ఈ సినిమా రిలీజ్ సమయంలో డబ్బులు ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు.

    డబ్బులు ఇవ్వలేదని

    డబ్బులు ఇవ్వలేదని


    ఈ పిటిషన్ విచారించిన కోర్టు వర్మ తాజా చిత్రం విడుదలను ఆపాలని తీర్పును వెలువరించింది. ఇక నిర్మాత నట్టి కుమార్ రామ్ గోపాల్ వర్మ పెద్ద మోసగాడు అంటూ ఆరోపణలు చేశారు. ఆయన పుట్టిన రోజు కాబట్టి సినిమా విడుదల కాకుండా గిఫ్ట్ ఇచ్చానని అన్నారు. నాకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలని, ఎప్పుడు డబ్బులు అడిగిన రెస్పాన్స్ లేదని అన్నారు.

    చిత్రాన్ని అడ్డుకున్నారు

    చిత్రాన్ని అడ్డుకున్నారు


    ఇక వర్మ కూడా అప్పట్లో ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్న నట్టి కుమార్, నట్టి క్రాంతి, నట్టి కరుణ విషయం మీద ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నానని చెబుతూ ఆయన నోట్ విడుదల చేశారు. ఏప్రిల్ 8, 2022న మూడు భాషల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న నా డేంజరస్ చిత్రాన్ని ఆపటానికి నట్టి క్రాంతి, నట్టి కరుణ కుట్ర పన్ని , ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా 5వ జూనియర్ సివిల్ జడ్జి, సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు.

     డిఫమేషన్ కేసు

    డిఫమేషన్ కేసు


    ఆ కింది కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ని ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇప్పుడు నట్టి క్రాంతి నట్టి కరుణ ల మీద ఫోర్జరీ కి సంబంధించిన కేసు కాకుండా, వివిధ మీడియా ఛానళ్లలో నా పై చేసిన నిందలు, ఆరోపణలకు సంబంధించి నట్టి క్రాంతి,నట్టి కరుణ ల ఫాదర్ అయిన నట్టి కుమార్ మీద తుమ్మలపల్లి రామసత్యనారాయణ డిఫమేషన్ కేసు వెయ్యటమే కాకుండా రిలీజ్ కి ముందు ఫోర్జరీ డాక్యుమెంట్ ని ఉపయోగించి సినిమా ని ఆపి మాకు అపారమైన ఆర్థిక నష్టం కలిగించినందుకు డామేజ్ కేసు వెయ్యబోతున్నామని అన్నారు.

     అసలు రూపం బయట పడబోతోందని

    అసలు రూపం బయట పడబోతోందని


    ఇప్పుడు హైకోర్టు మా సినిమాను విడుదల చేసేందుకు క్లియరెన్స్‌ ఆర్డర్ ఇచ్చింది కనుక డేంజరస్ చిత్రాన్ని మే 6న విడుదల చెయ్యబోతున్నామని అన్నారు. దానికి సంభందించి మాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ లు కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నామని అన్నారు. ఇక ఫోర్జరీ చేసి, దానిని నిజమైన డాక్యుమెంట్‌గా ఉపయోగించడం ద్వారా నట్టి క్రాంతి, నట్టి కరుణ చేసిన క్రిమినల్ చర్యలకు సంబంధించిన విషయాలు, ఇంజక్షన్-ఆర్డర్‌ను సేకరించిన విధానాన్ని, చూస్తే నట్టి ఫ్యామిలీ నేరపూరిత స్వభావాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఈ ప్రెస్ నోట్ తప్ప, ఇకపై నేను ఈ విషయంపై ఇంకేం మాట్లాడబోను ..జస్ట్ వాళ్ల పైన చట్టపరమైన చర్యలపై మాత్రమే దృష్టి పెడతానని వర్మ పేర్కొన్నారు. అతి త్వరలో వారి అసలు రూపం బయట పడబోతోందని ఆయన అన్నారు.

    English summary
    Ram gopal varma releases a press note about natti kumar family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X