»   » నా ప్రయత్నానికి సార్థకత చేకూరినట్టే: సన్నీలియోన్ పై ఆమె కామెంట్ కి వర్మ రిప్లై ఇలా...

నా ప్రయత్నానికి సార్థకత చేకూరినట్టే: సన్నీలియోన్ పై ఆమె కామెంట్ కి వర్మ రిప్లై ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మేరీ బేటీ సన్నీలియోన్ బన్నా చాహతి హై'.... సంచలన దర్శకుడు వర్మ .. తన క్రియేటివిటీ చూపించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇప్పటికే గన్స్ అండ్ థైస్ అంటూ ఓ వెబ్ సిరీస్ ని రూపొందించి సంచలనం రేపాడు. ఆ ట్రైలర్ చూసినవారంతా షాక్ అవుతున్నారు, ఇది ట్రైలరా లేక బ్లూ ఫిలిం అని ? ఇక దాని తరువాత అయన " మేరీ బేటీ సన్నీలియోన్ బన్నా చాహతి హై "" అంటూ మరో షార్ట్ ఫిలిం ని రూపొందిచాడు.

తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారు

తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారు

ఈ ఫిలిం ఈ రోజు విడుదలైంది. ఇండియా లో తమ కూతురు సన్నీ లియోన్ కావాలని అనుకుంటే ఆమె తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారు ? అన్నది ఈ సినిమా కాన్సెప్ట్ !! సన్నీ లియోన్ ని కావాలనుకున్న అమ్మాయి ఎలా తన తల్లిదండ్రులకు సెక్సువాలిటీ గురించి చెప్పింది అన్నది ఆసక్తికరంగా మారింది.

వర్మ చెప్పిన సమాధానం

వర్మ చెప్పిన సమాధానం

ఈ షార్ట్ ఫిల్మ్‌కు సంబంధించి వర్మ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో వర్మను అడిగిన ఓ ప్రశ్న, అందుకు వర్మ చెప్పిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మీ కూతురు పోర్న్ స్టార్ అవుతాను నాన్నా అని మిమ్మల్ని అడిగితే మీరు అంగీకరిస్తారా అని వర్మను విలేకరి ప్రశ్నించగా... ఆ ప్రశ్నకు వర్మ చెప్పిన సమాధానం ఆయన మాటల్లోనే...

నేను తనకు మాస్టర్‌ని కాదు

నేను తనకు మాస్టర్‌ని కాదు

‘కాసేపు ఆ యువతి నా కూతురనుకుందాం. నేను తనకు మాస్టర్‌ని కాదు... ఇది చేయాలి.. అది చేయకూడదు అని చెప్పడానికి. ప్రకృతిపరంగా జరిగిన ఓ చర్య వల్ల నా కూతురు నాకు, నా భార్యకు పుట్టింది. నా తల్లిదండ్రులకు నేనెలా పుట్టానో.. తనూ నాకు అలానే పుట్టింది. మొత్తం మీద చెప్పేదేంటంటే ఈ భూమ్మీద ప్రతీ ఒక్కరూ ఓ ప్రకృతిపరమైన చర్య వల్ల పుట్టినవాళ్లే.

ఆమె వ్యక్తిగతంగా ఎంపిక చేసుకునే అంశం

ఆమె వ్యక్తిగతంగా ఎంపిక చేసుకునే అంశం

అలాంటప్పుడు నా కూతురు డాక్టర్ లేదా ఇంజనీర్ లేదా పోర్న్ స్టార్ లేదా పైలట్ లేదా సైనికురాలు లేదా రాడికల్ టెర్రరిస్ట్.. ఇలా ఏ వృత్తిని ఎంచుకుంటుందనేది ఆమె వ్యక్తిగతంగా ఎంపిక చేసుకునే అంశం. ఎందుకంటే ఆమె పుట్టింది.. ఈ ప్రపంచంలోకి వచ్చింది స్వతహాగా జీవించడానికి... నేను నిర్దేశించిన జీవనం కొనసాగించడానికి కాదు.

ఆమె వ్యక్తిగత అంశం

ఆమె వ్యక్తిగత అంశం

కాకపోతే నా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సలహానివ్వడం మంచిదే. కానీ ఏ రంగాన్ని ఎంచుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆమె వ్యక్తిగత అంశం". అంటూ చెప్పిన వర్మ తన ఉద్దెష్యం ఏమిటో చెప్పేసాడు. అయినా ఆయన మీద ఇంకా విమర్శలూ, తిట్లూ, ప్రశ్నలూ వస్తూండటం తో అతని ఫేస్‌బుక్ పేజ్ కింద ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

మీ కూతురు పోర్న్ స్టార్ అవుతానంటే

మీ కూతురు పోర్న్ స్టార్ అవుతానంటే

‘‘ముందుగా అందరూ ఇది ఓ సినిమా అని అర్థం చేసుకోవాలి. మీ కూతురు పోర్న్ స్టార్ అవుతానంటే సమర్థిస్తారా లేదా ఇలాంటి సున్నితమైన ప్రశ్నలు అడగటం హాస్యాస్పదం. బాలీవుడ్‌ బడా నిర్మాణ సంస్థలు ఎన్నో ఒక మహిళ వ్యభిచారాన్ని ఎంచుకుంటున్నట్లు, భార్య వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నట్లు సినిమాలు తీశాయి.

రోడ్ల వెంట తిరుగుతూ

రోడ్ల వెంట తిరుగుతూ

అలాంటి డైరెక్టర్లను కానీ, నటులను కానీ ఎప్పుడైనా ఇలా ఎందుకు తీస్తున్నారని అడిగారా. లేదు, మేం అడగం. జీవితంలో ఏమీ సాధించకుండా, రోడ్ల వెంట తిరుగుతూ మిగిలిపోయిన కోట్లాది మంది కంటే, వంటింటికే పరిమితమైన ఎంతోమంది కంటే ఆర్జీవీ గొప్పవాడే కదా. అతని సాధనకు కనీస గౌరవమైనా ఇవ్వండి.

పాజిటివ్స్ గురించి మాట్లాడండి

పాజిటివ్స్ గురించి మాట్లాడండి

ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడండి. ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటించిన వారి నటనా సామర్థ్యానికి కాంప్లిమెంట్స్ ఇవ్వండి, ఆ అమ్మాయి అందం గురించి, ఆమె తండ్రిగా నటించిన వ్యక్తి రియలిస్టిక్ యాక్టింగ్, ముగ్గురు వ్యక్తులను మాత్రమే పెట్టి 11 నిమిషాల్లో తను చెప్పాలనుకున్నదేంటో స్పష్టం చేసిన డైరెక్టర్‌‌ను అభినందించండి.

షార్ట్ ఫిలింలో నీతిని గుర్తించండి.

షార్ట్ ఫిలింలో నీతిని గుర్తించండి.

మహిళలు తమ జీవితంలో ఏ రంగాన్నైనా ఎంచుకునే విషయంలో స్వేచ్చగా తమ అభిప్రాయాన్ని చెప్పాలనే ఈ షార్ట్ ఫిలింలో నీతిని గుర్తించండి. తల్లిదండ్రుల స్పందనను గుర్తించండి. ఈ దేశంలో ఉన్న ఎంతో మంది మహిళలకు ఆర్జీవీ ఓ దూత లాంటి వాడని నేను బలంగా నమ్ముతున్నాను.

పరిణతి చెందిన వ్యక్తులకు మాత్రమే

పరిణతి చెందిన వ్యక్తులకు మాత్రమే

తెలివైన వారు, పరిణతి చెందిన వ్యక్తులకు మాత్రమే వర్మ ఫిలాసఫీ అర్థమవుతుంది. మిగిలిన వారు వర్మను అన్‌ఫాలో అవ్వడం బెటర్. ఎందుకంటే మీకు మీరు క్రిటిక్స్‌గా మారకండి. ఆర్జీవీ మీరో అద్భుతమైన వ్యక్తి''. అంటూ అక్కడ అడిగే వింత ప్రశ్నలకు సమాధానం గా పేద్ద కమెంట్ లో స్పందించిందామె.

ఈమె కామెంట్‌కు రిప్లై ఇచ్చాడు

ఈమె కామెంట్‌కు రిప్లై ఇచ్చాడు

సాధారణం గా ఎప్పుడూ ఏ కామెంట్‌కు రిప్లై ఇవ్వని ఆర్జీవీ ఈమె కామెంట్‌కు రిప్లై ఇచ్చాడు. హరిణి అర్థం చేసుకున్న తీరుకు తాను ఎంతో ప్రభావితం అయ్యానని, మేరీ బేటీ సన్నీలియోన్ బన్నా చాహతి హై ఆమె అర్థం చేసుకుని, స్పందించిన తీరు తనకు నచ్చిందని వర్మ రిప్లై ఇచ్చాడు.

rnrn

సార్థకత చేకూరినట్టే

నా షార్ట్ ఫిల్మ్ చూసి ఇలాంటి స్పందనలు వస్తే తన ప్రయత్నానికి సార్థకత చేకూరినట్టేనని ఆర్జీవీ అభిప్రాయపడ్డాడు. అయితే ఆమె కమెంట్ కి కూడా పలువురు "సాంప్రదాయ వాదులు" విమర్షలూ, ప్రశ్నలతో ఇంకా వెంట పడుతూనే ఉన్నారు.

English summary
Ram Gopal Varma's first short film 'Meri Beti SUNNY LEONE Banna Chaahti Hai' sheds some new light on Sunny Leone and it isn't exactly a glorification. The short film which is out on YouTube deals with questions that some may find too uncomfortable.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu